Moviesతొడకొట్టి మరి ఆ డైలాగ్ చెప్పిన బాలయ్య..విజిల్స్ వేయాల్సిందే..!!

తొడకొట్టి మరి ఆ డైలాగ్ చెప్పిన బాలయ్య..విజిల్స్ వేయాల్సిందే..!!

ఆహా..సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ . రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా అనేక సినిమాలు సిరీస్ లు,సినిమాలు,తాక్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సరికొత్త ప్రయోగంగా ఓ టాక్ షోను ప్రాంభించి..గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అభిమానులని ఎంటర్ టైన్ చేయడం కోసం ఏమైన చేసే బాలయ్య.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆహా వారితో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కె అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్‌ ఎనర్జీతో షోను సింగిల్‌ హ్యాండ్‌తో నడిపించడమే కాక ఎలాంటి ఈగోలు లేకుండా అందరు హీరోలను కలుపుకుపోతున్న బాలయ్య తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇక ఇప్పటికే ఈ టాక్ షోకి పలువురు బడా స్టార్ సెలబ్రిటీస్ వచ్చి సందడి చేయగా..పుష్ప సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న బన్నీ గెస్ట్ గా వచ్చారు. అల్లు అర్జున్ తో పటు..పుష్ప సినిమాలో డీ గ్లామరస్ రోల్ లో నటించి మెప్పించిన రష్మిక, అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా వచ్చి సందడి చేసారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలై 200 కోట్ల వందల క్లబ్‏ను క్రాస్ చేసింది పుష సినిమా. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో తగ్గేదే లే డైలాగ్ ట్రెండ్ అవుతుంది.

ఇక షో కి వచ్చిన బన్నీ చూసి బాలయ్య కూడా పుష్పరాజ్‌లా మారిపోయాడు. అచ్చం పుష్పరాజ్‏ను ఇమిటేట్ చేస్తూ తొడకొట్టి మరీ తగ్గేదే లే డైలాగ్‏తో అదుర్స్ అనిపించారు బాలయ్య. అతడి స్టైల్‌లో నడుస్తూ.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ! తగ్గేదేలే..’ అని డైలాగ్‌ చెప్పి తొడగొట్టాడు. ఇక ఈ డైలాగ్ తో అక్కడున్న అభిమానులంతా ఒక్కసారిగా విజిల్స్ తో ఆడిటోరియాన్ని ఓ ఊపు ఊపారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news