Moviesఎన్టీఆర్‌కు ఆ సీనియ‌ర్ హీరో బావే.. ఆ బంధం ఎందుకు తెగింది..!

ఎన్టీఆర్‌కు ఆ సీనియ‌ర్ హీరో బావే.. ఆ బంధం ఎందుకు తెగింది..!

సీనియ‌ర్ హీరో వ‌డ్డే న‌వీన్ 1990వ ద‌శ‌కంలో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని ఊపేశారు. ఆ టైంలో వ‌రుస హిట్ల‌తో న‌వీన్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. సీనియ‌ర్ నిర్మాత‌.. విజ‌య‌మాధ‌వి కంబైన్స్ అధినేత వ‌డ్డే ర‌మేష్‌కు న‌వీన్ కుమారుడు. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి సినిమా న‌వీన్ కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసింది. ఆ త‌ర్వాత కోరుకున్న ప్రియుడు సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత న‌వీన్ మ‌న‌సిచ్చిచూడు – చాలా బాగుంది – ప్రేమించే మ‌న‌సు – మా బాలాజీ వంటి కొన్ని సినిమాల్లో న‌టించాడు. మొద‌టి సినిమాతో మంచి న‌టుడిగా, హీరోగా ఫ్రూవ్ చేసుకున్న న‌వీన్ త‌ర్వాత 30కు పైగా సినిమాల్లో న‌టించాడు. 2004 త‌ర్వాత న‌వీన్‌కు యువ హీరోల పోటీ ఎక్కువ కావ‌డంతో పాటు త‌ర్వాత జ‌న‌రేష‌న్ నుంచి స్టార్ హీరోలు రావ‌డంతో క‌నుమరుగు అయిపోయాడు.

ఇక వ‌డ్డే న‌వీన్‌కు నంద‌మూరి ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. ఈ క్ర‌మంలోనే దివంగ‌త ఎన్టీఆర్ త‌న కుమారుడు నంద‌మూరి రామ‌కృష్ణ కుమార్తె విజ‌య చాముండేశ్వ‌రితో న‌వీన్‌కు పెళ్లి ఖాయం చేశారు. ఇది ఎన్టీఆర్ స్వ‌యంగా కుదిర్చిన సంబంధం. అయితే అంత‌కంటే ముందే వీరు ప్రేమించుకున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు.

నంద‌మూరి ఫ్యామిలీతో బంధుత్వం తెంచుకున్న న‌వీన్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు. అయితే కెరీర్‌లో మాత్రం రాణించ‌లేదు. ఇక హ‌రికృష్ణ కుమారుడు అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు, న‌వీన్‌కు కూడా మంచి ఫ్రెండ్‌షిఫ్ ఉంది. వీరిద్ద‌రు ఎంతో అప్యాయంగా ఉంటారు. నంద‌మూరి ఫ్యామిలీతో న‌వీన్ బంధుత్వం తెగిపోయినా ఆ ఫ్యామిలీలోని ఎన్టీఆర్‌తో పాటు కొంద‌రు నంద‌మూరి వార‌సుల‌తో న‌వీన్ స్నేహం మాత్రం కొన‌సాగుతూ ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news