సుస్మితా సేన్..ఈ పేరు కు పెద్దగ పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితమే తన అందంతో మైమరపించిన ఈ భామ.. కొత్త భామలు వస్తున్న కూడా తన అందానికి పోటీ రాకుండా చూసుకుంటుంది. మాజీ మిస్ యూనివర్శ్ గా చలామణీ అవుతున్న ఈ భామ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలనూ వదలుతూనే ఉంది. ఇప్పుడు ఆమెకు 45 ఏళ్లు. ఇక ఈ వయసులోనూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఘాటు ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది.
సుస్మితా సేన్ ఫిట్నెస్ లెవల్స్ చూసి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఎలా ఉందని డిస్కషన్లు పెడుతున్నారు. ఇంత ఏజ్‌లో కూడా సుస్మితా సేన్ తన బ్యూటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని బాలీవుడ్ బ్యూటీస్ ఆశ్చర్యపోతుంటారు. అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్‌లో కూడా గ్లామర్ చెక్కుచెదరకపోవడానికి యోగా కారణమంటుంది సుస్మితా సేన్. ముఖ్యంగా సుస్మిత చేసే యోగాసనాలు చెయ్యడం చాలా కష్టమని మిగతా హీరోయిన్లు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఈ యోగాతోనే ఇప్పటికీ బాలీవుడ్లో మెయిన్ రోల్స్ ప్లే చేస్తోంది సుస్మితా సేన్.
ఇక 45 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకుని ఈ అమ్మడు డేటింగ్ కు మాత్రం చేస్తుంది. బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ గత కొద్ది కాలంగా తన బాయ్‌ఫ్రెండ్ తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సోషల్‌మీడియాలోనూ వీరిద్దరూ కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోలను సుస్మిత పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, నటుడు రోహ్మాన్ షాల్ తో ప్రేమాయణానికి ముగింపు పలికింది. ఇద్దరం విడిపోయినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘ మేము మా బంధాని స్నేహితులుగా మొదలుపెట్టాం. స్నేహితులుగానే ఉంటాం. మా మధ్య ఉన్న డేటింగ్ రిలేషన్ ముగిసింది రిలేషన్ షిప్ మాత్రం ముగిసిపోయింది. ప్రేమ మాత్రం కాదు’ అని సుష్మితా తెలిపింది. దీంతో నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. లేటు వయసులో ఇదేం పోయేకాలం తల్లి..అంటూ కామెంత్స్ పెడుతున్నారు.
View this post on Instagram