టాలీవుడ్ సినిమా చరిత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కు ఓ ప్రత్యేకమైన స్దానం ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి తనలోని డిఫరెంట్ షేడ్స్ అభిమానులకు చూయిస్తూ టాప్ హీరోల లిస్ట్ ఒక్కడిగా ఉన్నాడు.
ప్రస్తుతం తారక్ మొదటసారిగా పాన్ ఇండియా మూవీగా నటించిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. రాం చరణ్ కూడా ఈ సినిమాలో మరోక హీరోగా నటిస్తున్నారు. కంక్రాంతిపండు గ కానుకగా ఈ సినిమా జనవరీ 7న రిలీజ్ కానుంది.
అయితే తారక్ ఇది వరకే రాజమౌళితో రెండు సినిమాలు చేసాడు. స్టూడెంట్ నెం 1, యమదొంగ. రెండు సినిమాలు బాక్స్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యం గా యమ దొంగ సినిమా లో తారక్ అదర్గొట్టేసారు. ఈ సినిమాలో ఆయన మానవుడి పాత్రలో,యముడి పాత్రలో నటించి తన నటనతో అభిమానులను ఫిదా చేసారు.
ఇక ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ తో తారక్ స్టెప్పులేసారు. మెయిన్ హీరోయిన్లు మమతా మొహన్ దాస్,ప్రియమణి అయినా..ఈ సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉండడంతో తారక్ ఒక్క పాటలో రంభతో స్టెప్పులేయగా..మరో పాటలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో ఒక్కేసారి డ్యాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
హీరోయిన్ ప్రియమణితో రబ్బరు గాజులు అంటూ చెలరెగిపోయిన ఈయన..మమత మొహన్ దాస్ తో ఓలమ్మీ తిక్కరేగిందా అంటూ మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపేసారు. ఇక రంభతో నాచొరే నాచొరే అంటూ ఢిఫరెంట్ గా డ్యాన్స్ చేసిన ఈయన..ఇక యమలోకానికి వెళ్లాక అక్కడ రంభ, ఊర్వశి, మేనకలుగా నటించిన వేద, నవనీత్ కౌర్, ప్రీతీ జింగానీ హీరోయియిన్ల తో అద్దిరిపోయే స్టెప్పులేసి వావ్ అనిపించారు. ఇక ఈ సినిమా ఇప్పటికి టీవీలో వచ్చినా అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఏది ఏమైనా ఈ సినిమా తారక్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి.