వేటూరి తర్వాత తెలుగు పాటకు అంతటి గౌరవాన్ని తీసుకొచ్చిన ఒక్కే ఒక్క వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత సరళమైన పదాలతోనే ఆయన పాటను అలా అల్లేస్తాడు. వాడుక భాషలో ఆయన రాసిన పాటలు మన నోటి నుండి అలవోకగా వస్తుంటాయి. ఇక ఆ పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. సిరివెన్నెల అనే సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సీతారామశాస్త్రి.. ఆ సినిమా విజయంతో ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు గొప్ప వ్యక్తి.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఏ మచ్చా లేని అచ్చమైన తెలుగు పాటను తన కలం ద్వారా చిలుకరించి తెలుగు మదిని పలకరించి పరవశింపచేసిన ఘనత ఆయనదే.ఒక కీలకమైన సన్నివేశానికి పాటను రాయడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సాదా సీదా పాటలను ఎవరైనా రాసేస్తారు. మొత్తం సినిమానీ దాని ఆత్మను అక్షర బద్ధం చేస్తూ పాటను రాసి చిరంజీవి చేయడం అంటే అంత సులభమైన పని కానే కాదు. అలాంటి పాటలను తన కెరీర్ లో ఎన్నో రాసారు ఈయన.
కాగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి తనకు తానే ఓ రూల్ పెట్టుకున్నారట. గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. స్మోకింగ్ అలవాటుపై కొన్ని కీలక విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆయన ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మృతిచెందిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన ఈ వ్యాఖలే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకి ఆయన ఏమన్నారో తెలుసా..?
ఆయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..”నాకు చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు పట్టుకుంది. తప్పు అని తెలిసినా కానీ ఎందుకో అలవాటు మానుకోలేకపోయాను. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. అలా అలా అతి ఓ వ్యసనంగా మారిందని. ఎంత ట్రై చేసినా మానలేకపోయా. అప్పుడు అర్ధమైంది ఒక దానికి ఎడిక్ట్ అయితే ఎంత కష్టమో అని. అసలె నాకు అహంకారం ఎక్కువ.. అయినా కానీ సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతు వచ్చాను. కానీ స్మోకింగ్ మానలేకపోయిన. నాకు నేనే పెట్టుకున్న ఓ రూల్ మాత్రాని గట్టికి ఫాలో అవుతూ వచ్చా. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.