Moviesబిగ్ బాస్ లో మోస్ట్‌ అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్స్‌ ఇవే..!!

బిగ్ బాస్ లో మోస్ట్‌ అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్స్‌ ఇవే..!!

తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో అయిన బిగ్ బాస్ ..ఇప్పటిక్కే నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకుని..మరి కొన్ని రోజుల్లో ఐదవ సీజన్ కూడా కంప్లీట్ చేసోబోతుంది. ఇక బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి నామినేషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటి నుండి బయటకు పంపడానికి ఎలిమినేషన్స్ ప్రక్రియ జరుపుతారన్న విషయం అందరికీ తెలిసిన సంగతే. హౌస్మేట్స్ తోటి కంటెస్టెంట్స్ లో ఎవరినైతే ఎక్కువగా నామినేట్ చేస్తారో వాళ్ళే ఎలిమినేషన్స్ లిస్ట్ లో చేరే కంటెస్టెంట్లు.

ఇక ఎలిమినేషన్ లైనప్ లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు సేఫ్ అవుతారు.. తక్కువ ఓట్లు పడినవాళ్లు ఎలిమినేట్ అవుతారు. కానీ బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేష్నస్ చూస్తే షాకింగా అనిపిస్తాయి. బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉండి..ఇంట్లో టాస్క్ లు బాగా ఆడుతూ ఉన్నా కూడా సడెన్ గా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా బిగ్ బాస్ లో జనాలను షాక్ గురి చేసిన ఎలిమినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

యాంకర్ రవి: బిగ్ బాస్ చరిత్రలోనే మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ ఇదే. బయట ఎంతో ఫాలోయింగ్ ఉండి కూడా టాప్ 5 లో ఉండే సత్త ఉన్నా కూడా బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ రేసులో ఉన్న ఈయన ఎవరూ ఊహించని విధంగా మూడు వారాల ముందే ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు.

దేవి నాగవల్లి: బిగ్ బాస్ 4 తెలుగులో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ దేవి నాగవల్లి. కచ్చితంగా 10 వారాల వరకు ఉంటుందని ఊహించిన ఈమెను.. మూడో వారమే పెట్టాబేళా సర్దుకోమన్నారు. తన ఎలిమినేషన్ అన్యాయం అని దేవి సైతం కామెంట్ చేసింది. దేవీ మూడో వారమే ఎలిమినేట్‌ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రిన్స్: సీజన్ 1 కంటెస్టెంట్ ప్రిన్స్.. మొదటి నుండీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి పరిస్థితి తారుమారు అయిపోయింది. అనుహ్యంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసరు.

యాంకర్‌ శ్యామల: బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్‌ శ్యామల బిగ్‌బాస్‌ సీజన్‌-2 లో హౌస్‌ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్‌ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్‌ కావడం షాకింగ్‌గా అనిపించింది.

అలీ రెజా: అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్‌బాస్‌ సీజన్ 3 ఎంట్రీతో పాపులర్‌ అయ్యాడు. అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్‌-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. దీంతో అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి.

రోహిణి : సీజన్ 3 లో ఈమె కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ ఈమె అల్లరి చేష్టల వల్ల నామినేట్ అవ్వడం.. తక్కువ ఓట్లు పడడంతో ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news