Gossipsషాకింగ్: ఆ బడా హీరో కొడుకు అంజలిని వాడుకుని వదిలేసాడట..?

షాకింగ్: ఆ బడా హీరో కొడుకు అంజలిని వాడుకుని వదిలేసాడట..?

అంజలి..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో తన చలాకీ తనంతో అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్. నిజానికి సినిమా రంగంలోని ప‌రిస్థితుల కార‌ణంగా అయితేనేమి, ఇత‌ర‌త్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంత‌గా న‌ట‌నారంగంవైపు ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఆలా తక్కువ మందిలో అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ఒక్కరు. ఆ స‌మ‌యంలో శివ‌నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించిన ఫోటో చిత్రంతో అచ్చ‌తెలుగు అమ్మాయి అంజ‌లి ప‌రిచ‌య‌మ‌యింది. ఆమె తెలుగు అమ్మాయి అయినా సరే తమిళ్లో మొదట ఇన్నింగ్స్ మొదలు పెట్టి తెలుగులో కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.

గీతాంజ‌లి, షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగమ్మాయి ‘అంజలి’ తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకొంటోంది. వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్ అంటూ అచ్చమైన తెలుగు అమ్మాయిలా అమాయకంగా మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అంజలి. జర్ని సినిమాలో నటించిన తర్వాత ఆమెకు బాగా పేరు తీసుకు వచ్చింది.

అంజలి లావుగా బొద్దుగా ఉండటంతో కోలీవుడ్ లో వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. కోలీవుడ్, మాలీవుడ్ లో అంజలి వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది. అయితే తెలుగు లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది..సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగ్ లో దర్శనమిచ్చింది. కొద్ది రోజుల క్రితం తమిళ హారర్ సినిమా ‘లిసా’.. తెలుగులోనూ అదే పేరుతో వచ్చింది కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో అంజలి ఒక కీలక పాత్రలో నటించింది.

అయితే అంజలీనీ ఓ స్టార్ హీరో కొడుకు నమ్మించి మోసం చేసాడనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినీ కెరియర్ లో ఓడిదుడుకులు ఎదుర్కునేటప్పుడు ఒక స్టార్ హీరో కొడుకు లవ్ పేరుతో దగ్గరై ఆమెను వాడుకొని వదిలేసాడన్న వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంతకాలం ప్రేమించుకున్న వీరు ఇప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాల్మగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట వారి ఒకరితో ఒకరు చాలా దగ్గరగా ఉన్న పిక్స్ కూడా లీక్ అయ్యాయి.అంజలి అంటే బోర్ కొట్టేసిందో ఏమో కాని ఆయన అంజలిని దూరం పెడ్డేసాడు అన్న వారత్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందట. అలాగే తమిళ్, మలయాళం, కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటిస్తుందని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news