ముదురు ఆంటీ టబు.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. వయస్సులో ఉండగా కుర్రాళ్ల మతులు పొగొట్టిన టబు..అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక వయసులో ఉన్నప్పుడే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ ఊపు ఊపేసింది. టబుకు 50 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. టబు ఓ తెలుగు టాప్ హీరోతో ఘాటుగా ఎఫైర్ నడపడంతో అతడికి పూర్తిగా బానిస అయిపోయి హైదరాబాద్లోనే ఉండడంతో పాటు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఆ హీరోకు ఆమె పూర్తిగా అర్పితం కావడంతోనే టబు జీవితంలో ఇప్పటకీ పెళ్లి అన్నమాటే మార్చిపోయిందంటారు అందరు.
టాలీవుడ్, ఆమె బాలీవుడ్లో పలు సినిమాలు చేసి హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాలు మంచి గుర్తింపు ఇచ్చాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో ఆమె చేసిన నటనకు తెలుగు కుర్రకారు అప్పట్లో ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కూలీ నెంబర్ 1, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, ప్రేమదేశం, ఆవిడా మా ఆవిడే, పాండురంగడు, ఇదీ సంగతి సినిమాల్లో మెప్పించింది. ఇక తెలుగులో ఆమె నటించిన లాస్ట్ సినిమా అల వైకుంఠపురములో సినిమాతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ చేస్తుండడం గమనార్హం. ఇక పూజా పాతలో కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా టబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమా కు సమబంధించి దర్శకుడుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
దానికి చాలా మంది లైక్ లు కొడుతున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోకు టబు కూడా కామెంట్ చేసింది.” ఇది చాలా మంచి సినిమా జాగ్రత్తగా రీమేక్ చేయండి” అంటూ కామెంట్ పెట్టింది. ఇక టబు కామెంట్స్ కు రిప్లై ఇచ్చాడు హీరో. “మీ సినిమా కాబట్టే చాలా ప్రేమతో చేస్తున్నం” అంటూ కౌంటర్ రిప్లై ఇచ్చాడు. అయితే అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ తల్లిగా టబు నటించిన సంగతి తెలిసిందే