టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ట్రిఫుల్ ఆర్. బాహుబలి – ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్‌దేవగన్, ఆలియాభట్, ఒలివియో మోరీస్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య రు.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రధాన తారగణం అంతా సౌత్ టు నార్త్ వరకు ప్రమోషన్లను హోరెత్తించేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతలా కష్టపడ్డాడు అనేది ఇప్పటికే రాజమౌళి చెప్పాడు. తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
అడవిలో ఎన్టీఆర్ పరిగెత్తే సీన్లతో పాటు డూప్ లేకుండా చేసిన హై రిస్కీ షాట్స్, బైక్ డ్రైవింగ్ ఇవన్నీ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉన్నాయి. రాజమౌళి తాను అనుకున్నట్టుగా షాట్ వచ్చే వరకు ఎలా పిండేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నటనలో ఎన్టీఆర్ ఎలాంటి రిస్కీ షాట్ అయినా కొట్టిన పిండిలా చేస్తాడు. ఇక గతంలోనే రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో స్టూడెంట్ నెంబర్ – సింహాద్రి – యమదొంగ – ఇప్పుడు ఆర్ ఆర్ సినిమా వస్తోంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్లు హోరెత్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రు. 1000 కోట్ల వసూళ్లతో బరిలోకి దిగుతోంది. అయితే రాధే శ్యామ్ కంటే వారం రోజుల ముందుగా థియేటర్లలోకి రావడం ఈ సినిమాకు ప్లస్ కానుంది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సైతం ఈ సినిమా వచ్చాక నాలుగు నెలల పాటు ఏ సినిమాను రిలీజ్ చేయవద్దని చెప్పాడంటే ఆర్ ఆర్‌పై అంచనాలు ఎలా ? ఉన్నాయో అర్థమవుతోంది.
View this post on Instagram