Moviesకండోమ్‌ టెస్టర్‌ గా రకుల్: నాకు నచ్చింది.. చేస్తున్నా..చాలా హాయిగా ఉంది..!!

కండోమ్‌ టెస్టర్‌ గా రకుల్: నాకు నచ్చింది.. చేస్తున్నా..చాలా హాయిగా ఉంది..!!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..ఒక్కప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ హీరోయిన్..ప్రస్తుతం ఇక్కడ ఒక్క సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. ఎందుకంటే ఆమెను ఇక్కడ దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. తెర పైకి వస్తున్న కొత్త అందాలు ముందు రకుల్ అంద చందాల బోర్ కొట్టేసాయ్ ప్రజలకి..అందుకే ఆమె పై పెద్దగా ఇంట్రెస్ట్ చూయించట్లేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

నిజానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి తెలుగులో ‘మన్మథుడు2’ ఎప్పుడైతే చేసిందో.. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. సీనియర్ హీరోయిన్ అని యంగ్‌స్టర్స్, యూత్‌లో క్రేజ్‌ తగ్గిపోయిందని స్టార్ హీరోలు వివిధ కారణాలతో రకుల్‌ని పక్కన పెట్టేస్తున్నారు.ఇక టాలీవుడ్ లో మిస్ అయిన సినిమా ఛాన్స్ లను బాలీవుడ్ లో సెట్ చేసుకునేందుకు తెగ ఆరాటప్డుతుంది ఈ భామ. దీంతో బాలీవుడ్‌ పైనే ఏకాగ్రత పెట్టుకుంది. వరుస సినిమాలతో అక్కడ బిజీ కావాలని ఆరాపడుతోంది.

ఇక కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంచుకున్న సినిమాలను చూస్తుంటే రూటు మార్చిన్నట్లు అర్ధమౌతుంది. గ్లామర్‌ పాత్రల నుంచి వైవిధ్యమైన పాత్రలవైపు ఆమె అడుగులేస్తుంది. స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛత్రివాలీ’. తేజస్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల లక్నోలో పూర్తయింది. ఈ సినిమాలో రకుల్ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అయి ఉద్యోగం కోసం వెతికే ఓ అమ్మాయికి ప్రొఫెషనల్‌ కండోమ్‌ టెస్టర్‌గా ఉద్యోగం వస్తుంది. అయితే బయట ఈ జాబ్ చేస్తున్నాం అంటే ఏమంటారనో, బయట, ఇంట్లో చెప్పకుండా జాబ్ చేసే మహిళగా రకుల్ కనిపించబోతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక కోణంలో చూపిస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పై రకుల్ స్పందిస్తూ..”నాకు ఎంతో నచ్చి, నమ్మి చేస్తున్న సినిమా ‘ఛత్రివాలీ’. ఈ సినిమా ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది” అని ఇన్‌స్టాలో రాసింది రకుల్‌. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక రకుల్ వ్యక్తిగత విషాయాలకు వస్తే కొంతకాలం జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిన రకుల్‌ ఇటీవల తన రిలేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రకుల్ క్లారిటీ ఇస్తూ..పెళ్లి అప్పుడే చేసుకునే ఆలోచన లేదంటూ తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news