Movies' అఖండ ' నేష‌న‌ల్ రికార్డ్‌.... బాల‌య్య దెబ్బ మామూలుగా లేదే...!

‘ అఖండ ‘ నేష‌న‌ల్ రికార్డ్‌…. బాల‌య్య దెబ్బ మామూలుగా లేదే…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో తెర‌కెక్కిన అఖండ సినిమా మూడు వారాల క్రింద‌ట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన పెద్ద సినిమా అయిన అఖండకు ముందు మాస్ సినిమా అన్న టాక్ వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. సినిమాలో మాస్ సీన్లు ఎక్కువుగా ఉన్నాయ‌ని.. ఫైట్లు ఎక్కువ‌య్యాన్న టాక్ వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాస్ జాత‌ర త‌ల‌పించింది.

బాల‌య్య కెరీర్‌లో ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాగా రికార్డ‌ల‌కు ఎక్క‌డంతో పాటు ఇప్ప‌టికే రు. 125 కోట్ల వ‌సూళ్ల‌కు చేరువ అయ్యింది. అఖండ నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా వ‌సూళ్లు మాత్రం చాలా చోట్ల బాగున్నాయి. మ‌రోవైపు బ‌న్నీ పుష్ప ఉన్నా.. ఈ రోజు నాని సినిమా శ్యామ్‌సింగ రాయ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా కూడా అఖండ ఇంకా చాలా చోట్ల ర‌న్ అవుతోంది.

నైజాం, సీడెడ్‌లో అఖండ జోరు మామూలుగా లేదు. నైజాంలో అయితే బాల‌య్య‌కు రు. 10 కోట్ల షేర్ వ‌స్తే గ్రేట్‌. అలాంటిది ఈ సినిమా రు. 20 కోట్ల షేర్‌తో ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం షాక్ ఇచ్చేలా వ‌సూళ్లు రాబ‌ట్టింది. మొత్తానికి అఖండ బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. మిర్యాల ర‌వీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించారు.

ఈ క్ర‌మంలోనే అఖండ మ‌రో అదిరిపోయే రికార్డు సొంతం చేసుకుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ డేటాబేస్ imdb లెక్కల ప్రకారం 2021 సంవత్సరానికి భార‌త‌దేశ‌పు అత్యుత్త‌మ సినిమాగా అఖండ నిలిచింది. బాల‌య్య అభిమానుల‌కు ఇంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాక‌పోయినా కూడా అఖండ 23 శాతం ఓట్ల‌తో నెంబ‌ర్ స్థానం కైవ‌సం చేసుకుంది. imdb … ఇండియా వైజ్‌గా ఎక్కువ జ‌నాదార‌ణ పొందిన టాప్ 5 సినిమాల లిస్ట్ ప్ర‌క‌టించారు.

ఇందులో బాల‌య్య అఖండ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ 16 శాతం, ఉప్పెన 16 శాతం, న‌వీన్ పోలిశెట్టి జాతిర‌త్నాలు 12 శాతం, ర‌వితేజ క్రాక్ 8 శాతం ఓట్ల‌తో త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా అఖండ సినిమా రిలీజ్ అయ్యాక బాల‌య్య క్రేజ్ మామూలుగా పెర‌గ‌లేదు. బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Latest news