ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రారంభ టాక్ తో దూసుకుపోతోంది. సుకుమార్ గత చిత్రం రంగస్థలం.. బన్నీ చివరి సినిమా అల వైకుంఠపురంలోతో పోల్చి చూస్తే పుష్ప సినిమా ఆ స్థాయిలో లేకపోయినా… సుకుమార్ ఏం అనుకున్నాడో ఆ కథను పర్ఫెక్ట్‌గా తెరమీద ప్రెజెంట్ చేశాడు. ఇక పుష్ప సినిమా బన్నీ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది.
తెలుగుతో పాటు అటు తమిళంలోనూ, కన్నడంలోనూ, మలయాళంలోనూ, ఉత్తర భారతంలో హిందీలోనూ భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల స్క్రీన్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను ముందుగా స్టార్ట్ చేసినప్పుడు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలని సుకుమార్ అనుకున్నాడట. అయితే ఒక సందర్భంలో రాజమౌళి సుకుమార్‌కు ఫోన్ చేసి పుష్పను పాన్ ఇండియా సినిమాగా చేయమని సలహా ఇవ్వడంతో… ఆ తర్వాత ఐదు భాషల్లో రిలీజ్ అయింది అని చెప్పారు.
పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సుకుమార్ దృష్టంతా తెలుగు మీదే ఉందట. అన్ని భాషల ప్రేక్షకులను ఈ సినిమా సంతృప్తి పరుస్తుందా ? అన్న సందేహం సుకుమార్‌కు ఉండేదట. అయితే రాజమౌళి ఓసారి సుకుమార్‌కు ఫోన్ చేసి పుష్పను తెలుగులో రిలీజ్ చేస్తే అది కేవలం తెలుగు సినిమా అవుతుందని… ఇండియా లోని మిగిలిన భాషలలో కూడా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుందని చెప్పడంతో… సుకుమార్ మరో ఆలోచన లేకుండా పుష్పను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు.
ఇక పుష్పను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడంలో సినిమా నిర్మాతలతో పాటు హీరో బన్నీ ఎంతో సహాయం చేశారని సుకుమార్ చెప్పాడు. అందుకే మళయాళ హీరో ఫాహద్ ఫాజిల్‌తో పాటు ఆ భాష నుంచే మరో నటుడిని కూడా తీసుకున్నారు.