ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా శుక్రవారం థియేటర్ల లోకి వచ్చింది. బన్నీ కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కిన పుష్ప తెలుగు – తమిళం – కన్నడ – మలయాళ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ అయింది. సౌత్ ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి గ్రిప్ తెచ్చుకున్న బన్నీ అటు బాలీవుడ్ లో పాగా వేయాలని అక్కడ పుష్పను భారీగా ప్రమోట్ చేశారు. బన్నీ తండ్రి అయిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనకు బాలీవుడ్లో ఉన్న పరిచయాలను… వాడుకుని ఎక్కువ స్క్రీన్లలో పుష్ప రిలీజ్ చేశారు.
అయితే సౌత్లో సినిమాకు ఎబో యావరేజ్ టాక్ వచ్చినా నార్త్‌లో మాత్రం నెగిటివ్ టాక్ వచ్చేసింది. అక్కడ పుష్ప మరీ ఘోరమైన వసూళ్లతో తొలిరోజే చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. బాలీవుడ్లో ఓవరాల్ గా చూస్తే హిందీ వెర్షన్ తొలిరోజు కేవలం 25 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో అయితే కనీసం ఐదు శాతం ఆక్యుపెన్సీ కూడా లేదంటే పుష్పను ప్రజలు తిరస్కరించారని అర్థమవుతోంది.
బన్నీ లాంటి మాస్ హీరోకు తొలి మూడు రోజుల్లో కచ్చితంగా నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. పుష్ప హిందీ వెర్షన్ ను రు. 20 కోట్లకు పైగా అమ్మారు. ఇప్పుడు ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. తొలి రోజే చాలా చోట్ల థియేటర్లలో 5 శాతం ఆక్యుపెన్సీ కూడా రాని పరిస్థితి ఉందంటే పుష్ప బాలీవుడ్ లో ఐదు కోట్లు కూడా వసూలు చేయడం కష్టమని అంటున్నారు. బన్నీకి పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ ఏమో గాని పరువు పోయినట్లయ్యింది.
బన్నీ తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే… యూట్యూబ్లో బిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప హిందీ వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. గతంలో రామ్ చరణ్ కు అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన తుఫాన్ సినిమాలాగానే.. ఇప్పుడు బన్నీకి కూడా పుష్ప అంతే అవుతుందా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.