భారీ హైప్ మధ్యలో అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయ్యింది. సినిమా వర్క్ కొంత పెండింగ్‌లో ఉండడం, సుకుమార్ అన్ని పట్టి పట్టి చూస్తుండడంతో అసలు ఈ నెల 17న అయినా పుష్ప థియేటర్లలోకి వస్తుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ పుష్ప థియేటర్లలోకి వచ్చేసింది. బన్నీ కెరీర్‌లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప ఐదు భాషల్లో ఏకంగా 3 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది.
తెలుగులో మాత్రం తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. నార్త్‌లో మాత్రం జస్ట్ ఓకే. అనుకున్న రేంజ్‌లో వసూళ్లు లేవనే అంటున్నారు. రెండు రోజులకే రు. 100 కోట్లు దాటేసిన వసూళ్లు మూడు రోజులకు రు. 171 కోట్లు అని చెప్పారు. అయితే ఇవన్నీ గ్రాస్ వసూళ్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రు. 145 కోట్ల నెట్ కలెక్షన్లు రావాలి. నాలుగు, ఐదో రోజుల నుంచి వసూళ్లు అయితే డల్ అయ్యాయి. ఇప్పుడు బన్నీ సత్తాకు అసలు పరీక్ష మొదలు కానుంది.
ఈ క్రమంలోనే బన్నీకి కాస్త టెన్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వసూళ్లు వాస్తవంగా ఎక్కువే అని చెప్పాలి. అయితే సినిమాకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువుగా ఉండడంతో ఇప్పుడు అది రికవరీ అవుతుందా ? లేదా ? అన్నది చూడాలి. అయితే మేకర్స్ మాత్రం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ నెల 24న నాని శ్యామ్‌సింగరాయ థియేటర్లలోకి వస్తోంది.
ఇంకా ఆంధ్రాలో 50 శాతం రికవరీ ఉంది. నైజాంలో 30 శాతం రికవరీ ఉంది. ఇక బన్నీ హ్యాపీగా ఉన్నా కూడా సినిమాకు తాను అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదన్న చిన్న టెన్షన్‌లో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అఖండకు జరిగిన మీడియా ప్రచారం, మౌత్ టాక్ ఇక్కడ స్ప్రెడ్ కావడం లేదన్న టాక్ కూడా బన్నీ పీఆర్ వర్గంలో కాస్త ఆందోళనకు కారణమవుతోందట. ఇప్పుడు వీళ్లు దీనిమీదే ప్రధానంగా కాన్‌సంట్రేషన్ చేస్తున్నారని టాక్ ?