టాలీవుడ్ లో ఎన్నో జంటలు ఉన్న అందరిలోకి అమల – నాగార్జున జంట ప్రత్యేకం. నిజానికి అమల ని రెండో పెళ్ళి చేసుకున్న నాగార్జున ఈ వ్యవహారంలో మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. ఇక అక్కినేని అమల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు ఉండరు. అమల టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అమల. హలో గురు ప్రేమకోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం అభిమానయం ఇప్పటికి చాలామంది ఫేవరేట్ అనే చెప్పాలి.
కాగా, అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల. జంతు సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్ సంస్థ’ను ఏర్పాటు చేసి, తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించారు అమల. ఇక నాగార్జున అమలకి అఖిల్ ఒక్కగానొక కొడుకు అన్న సంగతి తెలిసిందే.
అయితే అఖిల్ పుట్టిన కోన్ని నెలలు తరువాత నాగార్జున అమల దగ్గరకు వెళ్ళి.. మనకు ఒక్క బాబునే కదా..ఇంకో పాప ఉంటే బాగుండు అని అన్నారట. వెంటనే కొపడిన అమల నాగార్జున అపి అరుస్తూ..” నీకు ఎవరు చెప్పారు నాకు ఒక్క కొడుకు అని. నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు పేరు నాగ చైతన్య. చిన్న అబ్బాయి పేరు అఖిల్ .. నాకు ఈ ఇద్దరు కొడుకులు చాలు” అంటూ చెప్పిందట. ఇక ఆ మాటలు విన్న నాగార్జున ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారట. నాగచైతన్య ని ఇంత బాగా చూసుకునే అమ్మ దొరికినందుకు నాగ్ హ్యాపీ గా ఫీల్ అయ్యారట. అస్సలు నాగార్జున అమల దగ్గర నుండి ఆ మాటలను ఊహించలేదట.