Moviesమ‌హేష్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే న్యూస్‌.. EMK డేట్...

మ‌హేష్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే న్యూస్‌.. EMK డేట్ ఫిక్స్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. మామూలు రోజుల్లో అంతంతమాత్రంగా రేటింగ్ తెచ్చుకుంటున్న ఈ షో సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం టిఆర్పిల్లో రేటింగ్ దుమ్ము దులుపుతోంది. రామ్ చరణ్ తో మొదలు పెట్టిన ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఈ ఎపిసోడ్ ను ముగిస్తున్నట్టు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు – ఎన్టీఆర్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే ఇప్పటివరకు టెలికాస్ట్ చేయలేదు. ఈ ఎపిసోడ్ టీవీలో ఎప్పుడు వస్తుందా ? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ కు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న ఈ ఎపిసోడ్ డేట్ బ్లాక్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 4న ఎన్టీఆర్ – మ‌హేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు మహేష్ బాబు ఆన్స‌ర్ చేశారని టాక్. ఈ షోలో ఎన్టీఆర్ అడిగిన సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆన్స‌ర్ చేసిన‌ మహేష్ బాబు 25 లక్షలు గెలుచుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు – ఎన్టీఆర్ కలిసి బుల్లితెర‌పై కనిపిస్తున్న ఈ ఎపిసోడ్ టి ఆర్ పిలో దుమ్ముదులపడం ఖాయంగా కనిపిస్తోంది. మ‌రి ఈ వెండి తెర రారాజులు బుల్లితెర‌పై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ? చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news