Moviesఆ కార‌ణంతోనే హీరో న‌రేష్ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా..!

ఆ కార‌ణంతోనే హీరో న‌రేష్ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా..!

అల్లరి నరేష్ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈతరం జనరేషన్ హీరోలలో కామెడీ కథాంశాలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ కొట్టిన ఘ‌న‌త నరేష్‌కు దక్కుతుంది. త‌న‌ తండ్రి ప్రముఖ దర్శకుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ తనదైన కామెడీ సినిమాల‌తో ముద్ర వేశారు. ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో కామెడీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలిసిందే. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కు నటకిరీటి అనే గౌరవప్రదమైన రావడానికి కూడా ప్రధాన కారణం ఈవీవీయే..!

ఈ క్రమంలో తన ఇద్ద‌రు కొడుకులను ఆయ‌న హీరోలుగా పరిచయం చేశారు. పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఇక రెండో కుమారుడు అల్లరి నరేష్ అల్ల‌రి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్ హీరోగా ఈవీవి దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈవివి మార్క్ కామెడీ జోనర్ లో వచ్చిన సినిమాలే నరేష్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చాయి.

న‌రేష్ ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో అల్లరి నరేష్ లవ్ బ్రేకప్ అయిందట. ఒక టీవీ న్యూస్ రీడర్ తో అల్లరి నరేష్ ప్రేమాయ‌ణం నడిపిస్తున్నాడని ఆమెనే వివాహం చేసుకుంటాడ‌ని కూడా అప్పట్లో ఒక ప్రచారం అయితే జరిగింది. దీనిపై మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే నరేష్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. తనకు కాబోయే భార్య సాక్షి న్యూస్ రీడర్ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలా కోరుకోవడంలో తప్పు లేదని కూడా చెప్పాడు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో న‌రేష్‌ లవ్ బ్రేకప్ అయింది. తన తండ్రి మరణానంతరం 2015 లో కంఠ‌మ‌నేని విరూప‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప‌. న‌రేష్ భార్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news