బాలీవుడ్ హాట్ బ్యూటీ.. పొడుగు కాళ్ల సుందరి..వయ్యారి భామ కత్రినా కైఫ్ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెటెసింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో ఆమె ప్రేమలో మునిగితేలినా ఆమె ఫైనల్ గా పెళ్లి చేసుకుని ఒక్కటైయారు. బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ మూడు ముళ్ల బంధంతో భార్య భర్తలుగా మారారు. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వార హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఇరువురి కుటుంబ సభ్యులు సహా వారి వారి సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. మెహందీ వేడుక నుంచి కత్రినా ధరించిన లెహంగా వరకు ప్రతిదీ చర్చనీయంశంగా మారగా, పెళ్లిలో కత్రినా ధరించిన దుస్తులు అందరిని ఆకర్షించాయి.సెలబ్రిటీ జోడీ కావడంతో పెళ్ళికి ధరించే ఆభరణాలు చాలా రిచ్‌గా ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్ ధరించిన రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ రింగ్ ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.
ఈ నిశ్చితార్తపు ఉంగరంలో నీలమణితో చేసిన డైమండ్ అమర్చబడి ఉంది. చూడటానికి ఎంతో అందంగా, కాస్ట్లీగా కనిపిస్తోంది. నీలమణితో చేసిన డైమండ్ రింగ్ విలువ దాదాపు ఏడున్నర లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఇటువంటి ఉంగరం బ్రిటన్యువరాణి ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్‌తో నిశ్చితార్థం సమయంలో ధరించింది. ఇప్పుడు మళ్లీ కత్రినా అలాంటి రింగ్‌ను సొంతం చేసుకుంది.
దీంతో పాటు ఈ వేడుకలో కత్రినా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా హైలైట్ అయ్యాయి. ఆమె సబ్యసాచి అనే డిజైనర్ డిజైన్ చేసిన ఖరీదైన లెహంగా ధరించింది. మరోవైపు కత్రిన మెడలో ఉనన నల్లపూసల మంగళసూత్రం విలువ కూడా లక్షల్లో ఖరీదు చేస్తుందని సమాచారం. ఈ నల్లపూసకు చివర్లో రెండు డైమండ్ డ్రాప్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. విమానాశ్రయంలో వారిద్దరు జంటగా కనిపించి కనువిందు చేశారు. ఎయిర్‌పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కత్రినా న్యూ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. నుదుట సింధూరం, మెడలో తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో కత్రినా ఆకట్టుకుంటోంది.