Moviesభర్త కోసం కత్రినా.. ఆ మూడురోజులు ఒక్కసారి కూడా అలా చేయలేదట..!!

భర్త కోసం కత్రినా.. ఆ మూడురోజులు ఒక్కసారి కూడా అలా చేయలేదట..!!

ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బార్డ్స్..జంటగా మారారు. ఎన్నో పుకార్లు..మరెన్నో మాటాలు దాటుకుని ఫైనల్ గా భార్యభర్తలుగా మారారు.బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది.

పెళ్లయ్యే వరకు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట ఆ తరువాత సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేస్తున్నారు. రాజస్థాన్ లోని కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో విక్కీ-కౌశల్ ల వివాహం జరిగింది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మెహందీ, హల్దీ, వెడ్డింగ్ ఇలా ప్రతి ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఈ జంట.

బాలీవుడ్‌ నూతన వధూవరులు విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్‌లో చిన్న హానీమూన్‌ ట్రిప్‌ ముగించుకుని మంగళవారం ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

కాగా,  పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కత్రినా లండన్ లో పుట్టింది..కొన్నాళ్లు అక్కడే పెరిగింది. దీంతో ఆమె మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలదు. ఇక ముంబైకి వచ్చాక హిందీ కూడా నేర్చుకుంది. హీందీకూడా చక్కగా మాట్లాడుతుంది. కానీ అమ్మడు పంజాబీ భాషను కూడా నేర్చుకుందట.

ఎందుకంటే ఆమె భర్త విక్కి మాతృ భాష పంజాబీ..దీంతో వాళ్ల బంధువులతో మాట్లాడాలి అన్న..వాళ్లతో కలిసిపోవాలి అన్న ఆమెకు భాష అడ్డురాకుడదు అని పంజాబీని నేర్చుకుందట. అంతేకాదు పెళ్లి జరిగిన మూడు రోజులు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా టోటల్ పంజాబీ భాష మాట్లాడుతూ అందరి ఆశ్చర్యప్రిచిందట ఈ హాట్ బ్యూటి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news