Moviesస్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లికి అదే అస‌లు అడ్డంకా...!

స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లికి అదే అస‌లు అడ్డంకా…!

2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది అనుష్క శెట్టి. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన అనుష్క తొలి సినిమాతోనే తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆమె పదేళ్ల పాటు ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలు అందరితోనూ కలిసి అనుష్క నటించింది.

2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోలతో సమానంగా తెలుగులోని స్టార్ డ‌మ్‌ దక్కించుకుంది. తెలుగులో అయితే అనుష్క మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోల సరసన కూడా నటించింది.

ఆ తర్వాత అనుష్క ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇప్పటికే నాలుగు పదుల వయస్సుకు చేరువ అవుతున్న అనుష్క హ‌వా గత కొంత కాలంగా తగ్గిందనే చెప్పాలి ఇక అనుష్క పెళ్లి గురించి గత ఐదు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా… ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆమె వయసు ఉన్న హీరోయిన్లు అంద‌రూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇక మరో సీనియర్ హీరోయిన్ నయనతార కూడా వచ్చే ఏడాది విఘ్నేష్ ను పెళ్లి చేసుకుంది.

అనుష్క టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ హీరోతో ప్రేమలో ఉందని… కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సదరు సీనియర్ హీరో కూడా పెళ్లి చేసుకోకపోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు అనుష్క తల్లిదండ్రులు కూడా ఆమెకు త్వరగా పెళ్లి చేసేందుకు ఆరాటపడుతున్నా.. అనుష్క మాత్రం ఏదో ఒక సాకు చెప్పి వెళ్లి వాయిదా వేస్తూ వస్తోందట.

అయితే ఇటీవల అనుష్క తల్లిదండ్రులు ఆమె జాతకంలో దోషం ఉందని.. దాని కారణంగానే ఆమె పెళ్ళి జరగడం లేదని… దానికి దోషనివారణ చేశారని కన్నడ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. ఈ దోష నివారణ తర్వాత ఆమె పెళ్లి జరుగుతుందని ఆమె తల్లిదండ్రులు గట్టి నమ్మకంతో ఉన్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news