సౌందర్య.. చలన చిత్ర పరిశ్రమలో ఆమె కంతూ ఓ ప్రత్యేక స్ధానాని ఏర్పర్చుకుంది. దివంగత కన్నడ కస్తూరి సౌందర్య దక్షిణ భారత దేశ సినీ చరిత్రలో తన సినిమాలతో చెరగని ముద్రవేశారు. ఆమె కెరీర్ లో ఎందరో టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆమె సౌందర్య దక్షిణాదిలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంలో కలిపి మొత్తం 12 సంవత్సరాల కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డ్ సృష్టించింది.
అయితే సౌందర్య కు ఎస్వీ కృష్ణారెడ్డి తో మంచి ఫ్రండ్ షిప్ ఉండేది. యమలీల, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, శుభలగ్నం, మావిచిగురు, వినోదం, ఆహ్వానం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ తానై విజయవంతమైన ఫ్యామిలీ డైరెక్టర్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి పేరు సంపాదించుకున్నారు ఈయన. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఇప్పటికీ క్రేజే. ముఖ్యంగా అలీ నటించిన యమలీల.
ఇక ఈ సినిమాలో హీరో గా అలీ ని సెలక్ట్ చేసిన ఆయన హీరోయిన్ గా సౌందర్య ని అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె టాప్ పోజీషన్ లో ఉండడంతో..ఓ కమెడియన్ పక్కన చేస్తే సినిమా అవకాశాలు రావు ఏమో అని భయపడి ఆ అవకాశాని వదులుకున్నిందట. ఇక ఆ ప్లేస్ లోకి ఇంద్రజ వచ్చి నటించి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక తన తప్పు తెలుసుకున్న సౌందర్య..కొంతకాలం తరువాత ‘శుభలగ్నం’ సినిమాలో అలీతో ఓ స్పెషల్ సాంగ్ చేయాలనీ డైరెక్టర్ అనుకున్నారట.
అయితే ఆ పాటలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి స్వయంగా సౌందర్యనే అలీతో నటిస్తానని ఆయనకు చెప్పారట. డైరెక్టర్ ఎందుకు ఇలా అడుగుతున్నవ్ అని అడగ్గా.. ఆ రోజు అలీతో నటించే అవకాశం వదులుకున్నాను ఆ వెలితి నాలో ఇంకా ఉండిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతె అలీతో ఆ ఒక్క పాటలో నేను నటిస్తా అని అడిగారట. ముందు నటించను అని చెప్పినాగాని తరువాత తానే స్వయంగా నటిస్తానని చెప్పడంతోనే సౌందర్య గొప్పతనం ఏంటో అర్ధం అవుతుందని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యుల్లో తెలిపారు.. !!