బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ఆపర్లతో దూసుకుపోతోంది. ఆమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఆమె క్రేజీ ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. ఆర్ఆర్ సినిమాలో కేవలం పదిహేను నిమిషాల పాత్ర కోసం ఆమె ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నటించేందుకు కేవలం పది రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చిన ఆలియా రోజుకు 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే వీరి ప్రేమ కంటే ముందే మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక ఆలియా – రణబీర్ పెళ్లి ఇప్పటికే ఫిక్స్.. కాగా.. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారన్న ప్రచారం కూడా గత ఏడాది కాలంగా నడుస్తూ ఉంది.
ఇదిలా ఉంటే వీరి పెళ్లి కంటే ముందే రణబీర్ కపూర్ … మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. కత్రినా – విక్కీ పెళ్లికి సంబంధించి ఏ చిన్న సమాచారం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించి ఈ రోజు మెహంది.. సంగీత్ ప్లాన్ చేశారట. అయితే చాలా సీక్రెట్ గా జరుగుతున్న ఈ వెడ్డింగ్ కి ఆలియా వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఈ పెళ్లికి ఆహ్వానం అందుకున్న జంటలు అందరూ ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నా ఆలియా మాత్రం ముంబైలోనే చక్కెర్లు కొడుతుంది. ఆమె ముంబైలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆలియాను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి కూతురు తన భాయ్ ఫ్రెండ్ మాజీ లవర్ కదా ? కనీసం రణబీర్‌ను అయినా వెళ్లనిచ్చిందా ? లేదా ? అని ట్రోల్ చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం రణబీర్ కత్రినా పెళ్లికి వెళితే ఇద్దరికి బ్రేకప్ తప్పదని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కత్రినా పెళ్లి వేళ రణబీర్ – ఆలియా ప్రేమ వైరల్ అవుతోంది.