MoviesR R R నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌.. భీమ్ వ‌చ్చేశాడు..!

R R R నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌.. భీమ్ వ‌చ్చేశాడు..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ కోసం కోట్లాది మంది సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమా రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. ఇక శ్రియా చ‌ర‌ణ్‌, బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ట్రైల‌ర్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న వేళ ఈ సినిమా యూనిట్ తాజాగా ఆర్ ఆర్ కు సంబంధించి మ‌రో వీడియో రిలీజ్ చేశారు.

ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏపీ, తెలంగాణ‌లో 200 థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. భీమ్ పాత్ర‌కు సంబంధించి చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోకు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news