Moviesఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

సెల‌బ్రిటీలు ఏం చేసినా వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ఇక సోష‌ల్ మీడియా వ‌చ్చాక సెల‌బ్రిటీలు ఏం చేసినా ట్రెండ్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ల‌కు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు, వారి హాట్ ఫోటోలు, చిన్న‌ప్ప‌టి ఫొటోలు కూడా అంతే వైర‌ల్ అవుతున్నాయి. వారు త‌మ త్రో బ్యాక్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో అలా షేర్ చేయ‌డం ఆల‌స్యం… అవి నిమిషాల్లోనే వైర‌ల్ అయిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

మ‌రి ఈ హీరోయిన్ ఎవ‌రో ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ముకుంద సినిమాలో న‌టించిన పూజా హెగ్డే ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య ప‌క్క‌న ఒక లైలా కోసం సినిమాలో న‌టించింది. తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల మ‌దిని దోచిన ఈ అమ్మ‌డు బాలీవుడ్‌లో హృతిక్ రోష‌న్ ప‌క్క‌న మొహంజోదారో సినిమాలో న‌టించింది. ఆ సినిమాతో ఆమె దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా డీజే, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురంలో, మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ లాంటి హిట్ సినిమాల‌తో ఇక్క‌డ తిరుగులేని హీరోయిన్‌గా దూసుకు పోతోంది.

ప్ర‌స్తుతం ఆమె అటు బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తోంది. వ‌రుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతోంది. ఇక పూజా హెగ్డే ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో బుట్ట బొమ్మ‌గా మారిపోయింది. అక్కినేని కాంపౌండ్ హీరోల‌తో పాటు ఇటు మెగా హీరోల‌తోనూ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించిన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్‌తో పాటు మెగాస్టార్ ఆచార్య సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తోంది. ఇక బీస్ట్ సినిమా చేస్తోంది.

ప్ర‌స్తుతం మ‌రో రెండేళ్ల పాటు ఆమె డెయిరీ ఖాళీగా ఉండేలా లేదు. ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డంతో ఒక్కో సినిమాకు ఏకంగా రు. 3 కోట్లు డిమాండ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news