సినీ పరిశ్రమలో వారసులు రావడం కొత్తేమీకాదు. ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్, ఆర్, కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తున్నదే .. చూస్తున్నదే. స్టార్ హీరోల కొడుకులు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం ని సంపాదించుకొని సక్సస్ అయ్యారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు కొడుకు అరుణ్ కుమార్, నందమూరి ఫ్యామిలీలో తారక రత్న వంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. అంతేకాదు అలనాటి హీరో, హీరోయిన్స్ కూతుళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు .. వెలుగుతున్నారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, శరత్ కుమార్ ల తో పాటు అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి లాంటి స్టార్స్ కూతుళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.
కానీ స్టార్ డైరెక్టర్ బాపు గారి మనవరాలు అయి ఉండి కూడా ఆయన పేరు ఉపయోగించుకోకుండా కేవలం టాలెంట్ తోనే మొదట యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న నటి గాయత్రి భార్గవి. మొదటి నుండి సినిమాలు అంటే ఇష్టంతో చదువు కంప్లీట్ అయ్యాక యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి పాత్రలతో ఇప్పటికి మనలని అలరిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన కరోనా వైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన నటంతో మెప్పించ్చింది గాయత్రి. సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉన్నా కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతఆమె బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదట. సొంత టాలెంట్ తోనే సెటిల్ అవ్వాలని అనుకున్నారట. ఇక అలా కష్ట పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ..మంచ్గి పేరు తెచ్చుకోవడం అంటేనే ఆమెకు ఇష్టమట. బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వం అని భావించాను అని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు గాయత్రి. స్వయంకృషితో పెరిగితే అందులో ఉండే తృప్తి మరోదానిలో ఉండదు అని గాయత్రి భార్గవి ఎప్పుడు చెప్పుతుంటారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రి తన కెరియర్ లో జరిగిన అనుభవల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఓ యాడ్ ఫిలింస్ చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల్లోకి రావడం వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదట. సినిమాలు వద్దు అని ఎన్ని సార్లు చెప్పిన వినకపోవడంతో ..పిచ్చి వేషాలు వేస్తుంనాను అని తనకి చిన్న వయసులోనే పెళ్లి చేశారట. 21 ఏళ్లలోనే నాకు పిల్లలు పుట్టారట. ఆ తర్వాత తన భర్త ఆమె కల ను గుర్తించి సినిమాలు చేయమని చెప్పడంతో మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించాను అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చారు.