Moviesశ్రీదేవి ఆయన్ను కలిసిన ప్రతీసారి పాదాలకు నమస్కరించేవారట..ఎందుకో తెలుసా..!!

శ్రీదేవి ఆయన్ను కలిసిన ప్రతీసారి పాదాలకు నమస్కరించేవారట..ఎందుకో తెలుసా..!!

అతిలోక సుందరి శ్రీదేవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందంతో..నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆ తరువత హీరో శోభన్ బాబు-శ్రీదేవి జంట ప్రేక్షకూలను బాగా ఎంటర్ టైన్ చేసింది.

నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న శ్రీదేవి తెలుగు – తమిళ భాషల్లో అప్పట్లో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి సినిమా రిలీజవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు. సౌత్ ఇండియన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారతదేశం గర్వించే అతిలోకసుందరి అయిపోయింది. శ్రీదేవి ముందుగా కందన్ కరుణై అనే తమిళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. తొలినాళ్ళలో తమిళ, మ‌ళ‌యాళం సినిమాలు ఎక్కువగా చేశారు. కమల్ హాసన్ – శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో హిట్‌ సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉంది.

 

కాగా ఆమె బ్రతికి ఉండగానే కూతురిని హీరోయిన్ గా చూడాలని అనుకున్నారు కాని అది జరగలేదు. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి. ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే..అయితే తాజాగా జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ తన తల్లి గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

“అమ్మ గురించిన విషయాలు చెపుతూ..తన బాబాయ్ అనిల్ కపూర్ తో అప్పటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. అమ్మ అనిల్ కపూర్ బాబాయిని.. కలిసిన ప్రతీసారి ఆయన పాదాలకు నమస్కరించేవారు. అంతే కాకుండా తన ఫేవరెట్ కూడా అనిల్ కపూర్ నే” అన్నారు. ఇక అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి పలు హిందీ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే అనిల్ కపూర్ తన ఫేవరెట్ కో స్టార్ అని చాలాసార్లు శ్రీదేవి తనతో చెప్పిందని జాన్వీ కపూర్ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news