Moviesహై రికమెండేషన్ తో భీమ్లా నాయక్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ...

హై రికమెండేషన్ తో భీమ్లా నాయక్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలంతా కూడా మల్టీ స్టార్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇద్దరు బడా హీరోలతో సినిమా తీస్తే కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్లు రాబడతాయని ప్రోడ్యూసర్స్ కూడా మల్టీ స్టారర్ మూవీలకే ఇంట్రెస్ట్ చుయిస్తున్నారు. ఈ క్రమంలోనేబ్ పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా కలిసి భారీ మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు సాగర్ కే చంద్ర.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘అయ్యపనుమ్ కోషియుమ్’ అనే సినిమాను తెలుగులో “భీమ్లా నాయక్ ” అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ఈ మూవీకి ఎస్.ఎస్ థ‌మన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా 2022 జనవరి 12న విడుదల చేసేందుకు రెడి అయ్యారు చిత్ర బృందం. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఇద్ద‌రు హీరోల ఫ‌స్ట్ లుక్ తో పాటు ఇంట్రో టీజ‌ర్లు రిలీజ్ అయ్యి విశేషంగా ఆక‌ట్టు కుంటున్నాయి.

కాగా,ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అడవితల్లి మాట అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో నటి సంయుక్త మీనన్ కనిపించడంతో అసలు ఈ హీరోయిన్ ఎవరు అంటూ గూగుల్ లో సెర్చింగ్ లు మొదలు పెట్టారు కుర్రాళ్లు. దీంతో ఈ అమ్మడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటిస్తున్న ఈ అమ్మడు పేరు సంయుక్త మీనన్. పేరుకి మలయాళి బ్యూటీ అయినా చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉంటుంది. అందుకే కాబోలు డైరెక్టర్ ఏరి కోరి ఈ అమ్మాయిని సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారు.

ఇక ఈమె 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడం..వెంటనే తమిళ సినిమాల్లో ఆఫర్లు రావడం చక చకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే తమిళంలో అమ్మడుకి ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో మళ్లీ మలయాళంలో సిమాలు చేస్తూ బిజీ గా ఉన్న ఈ అమ్మడుకి భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా పెట్టుకోమని డైరెక్టర్ కు సలహా ఇచ్చింది త్రివిక్రమ్ శ్రినీవాస్ నేనట. అమ్మడు ఫోటోస్ ముందు చేసిన సినిమాలు చూసి సెకండ్ హీరోయిన్ గా పెట్టుకోమని రికమండ్ చేసారట. మరి చూడాలి సంయుక్త మీనన్ తెలుగు ప్రజలను ఎంతవరకు మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news