టాలీవుడ్లో లెజెండరీ హీరోలు సీనియర్ ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ మధ్య ఎంతో అనుబంధం ఉండేది. వారు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా… ఎప్పుడు వారి మధ్య ఇగో లేదు. వారిద్దరు కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ కాంబినేషన్ కు అప్పట్లో తెలుగునాట విపరీతమైన క్రేజ్ ఉండేది. వారిద్దరి వారసులుగా సినిమారంగంలో యువరత్న బాలకృష్ణ, యువ సామ్రాట్ నాగార్జున ఇద్దరు మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తండ్రుల సినీ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టారు.
కారణం ఏదైనా కావచ్చు… బాలయ్య – నాగార్జున మధ్య ఎందుకో గానీ ముందు నుంచి ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ మధ్య ఉన్నంత సన్నిహిత సంబంధాలు అయితే లేవు. ఏఎన్నార్ మృతి చెందినప్పుడు ఇండస్ట్రీ అంతా వెళితే బాలయ్య రాలేదు. అప్పుడు ఇండస్ట్రీ అంతా తరలివచ్చినా బాలయ్య మాత్రం అటువైపు చూడలేదు. అయితే అంతకు ముందు నాగార్జున ఇంట్లో ఎంతో వైభవంగా జరిగిన ఏఎన్నార్ కార్యక్రమానికి ( ఏఎన్నార్ జీవించి ఉండగా) ఇండస్ట్రీలో అందరినీ ఆహ్వానించిన నాగార్జున బాలయ్యను పిలవలేదు.
అయితే అది పొరపాటున జరిగిందా ? అనుకోకుండా జరిగిందా ? అన్నది తెలియదుగానీ… అది బాలయ్యకు నచ్చలేదని అంటారు. ఆ తర్వాత నాగార్జున స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి… బాలయ్యను బతిమిలాడినా బాలయ్య మనసు ఎక్కడో బాధ పడిందని అంటారు. ఇక నాగార్జున ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి మాట్లాడుతూ బాలయ్య అలా చెయ్యి పెట్టిన వెంటనే ట్రైన్ ఆగిపోవాలి.. అని చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెద్ద చర్చకు వచ్చాయి.
ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగార్జున… బాలయ్య సమక్షంలోనే తమ ఇద్దరికీ ఎక్కడో గ్యాప్ ఉందన్న ప్రచారం బయట ఎక్కువుగా వినిపిస్తోందని.. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని… బయట జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదే అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితమే బాలకృష్ణ చేయాలనుకున్న ఒక సినిమా నాగార్జున చేయటంతో బాలయ్య హర్ట్ అయ్యారని టాక్.
ఈ విషయాన్ని రాశి మూవీస్ అధినేత నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాశి మూవీస్ బ్యానర్ లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా మలయాళంలో విడుదలైన పాడికం సినిమాను
ఇక్కడ రీమేక్ చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అయ్యింది. అయితే అదే సినిమా రీమేక్ ను నాగార్జున వజ్రంగా చేశారు. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు.
ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత బాలయ్య తాను మంచి సబ్జెక్ట్‌ను పోగొట్టుకున్నా అని కోదండరామి రెడ్డితో కూడా అన్నారని నరసింహారావు చెప్పారు. అయితే వజ్రం సినిమాలో నాగ్ నటించటం బాలయ్యను కాస్త హర్ట్ చేసినట్టు ఉందని నరసింహారావు చెప్పారు