Moviesపుష్ప సినిమా అభిమానులకి నచ్చడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే..!!

పుష్ప సినిమా అభిమానులకి నచ్చడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే..!!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎట్టకేలకు నిన్న థియేటర్లలోకి వచ్చింది. రెండు భాగాలుగా భారీ రేంజ్‌లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు. దీంతో పుష్ప ప్రీమియర్ షోస్ భారీ ఆదరణ దక్కించుకున్నాయి. అభిమానులో అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సుకుమార్ సినిమాలోని ప్రతి సీన్ ను అధ్భుతంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన పుష్ప‌ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా స్లో గా సాగినప్పటికి బన్నీ పర్ ఫామెన్స్ తో అదరగిట్టేసారు. ఇక సమంత ,రష్మిక అందం సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి.

మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీ సీన్ కొత్తగా ఉన్నట్లు, ఇలాంటి సీన్స్ ఎక్కడా చూడలేదనే టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలాట్ గా నిలిచిందని అనేక మంది అంటున్నారు. పుష్ప సినిమా తొలిరోజు కేవలం తెలుగులోనే 5 కోట్లు కలెక్షన్ చేస్తుందని అంచనా. ఇది వన్ మ్యాన్ షో అని, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, పాత్రలో ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ రోల్‌కి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కాస్త మైనస్ అయిందనేది ప్రేక్షకుల వాదన. అయితే పార్ట్ 2 లో మాత్రం ఆయన పాత్ర అధ్బుతంగా ఉంటుందంటున్నారు.

ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ బ్యాక్ గ్రౌండ్ సెట్స్. ముఖ్యంగా ఎర్రచందనం నేపథ్యంలో సాగే పుష్ప మూవీ కోసం కృత్రిమంగా అడవిని క్రియేట్ చేశారట. కొన్ని సన్నివేశాలు అడవుల్లో, మరికొన్ని సెట్స్‌లో తీసినా ఏది నిజమైన అడవో? ఏది సెట్టో అనేది ప్రేక్షకులకు తేడా తెలియకూడదని , చాలా కష్టంగా అనిపించినప్పటికీ ఆడియన్స్ కి సెట్‌ అనే ఫీలింగ్ రాకుండా సెట్స్‌ వేయడం సవాల్‌గా నిలిచిందని ఆర్ట్ డైరెక్టర్స్కి. ఇక ‘పుష్ప’ సినిమా కోసం మొత్తం 25 సెట్స్‌ వేశారట .

‘పుష్ప’కి ఆర్ట్‌ డైరెక్టర్స్‌గా చేసిన రామకృష్ణ–మౌనిక వర్క్ చేసారు. ఇక వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతల తపన, ధైర్యం వల్లే సెట్స్‌ గ్రాండ్‌గా వేయగలిగాం అని చెప్పుకొచ్చారు. నిజానికి అలాంటి నిర్మాతలే ఇండస్ట్రీకి అవసరం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే పుష్ప సెట్స్ ఇంత బాగా వేయగలిగాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా వారం రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news