Moviesఈ హీరో అక్కినేని ఇంటి అల్లుడే..ఎలా చనిపోయాడో తెలుసా..?

ఈ హీరో అక్కినేని ఇంటి అల్లుడే..ఎలా చనిపోయాడో తెలుసా..?

సినిమాలో హీరో చనిపోయినా.. లేదా అప్పటివరకూ మంచిగా ఉన్న ఓ పాత్ర చనిపోయినా మనం చాలా బాధపడతాము. అయితే నిజ జీవితంలో మనల్ని అలరించే నటీనటులు చనిపోతే ? జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో.. ఎవరు ఏ స్థాయిలో ఉంటారో.. ఎవ్వరూ ఊహించలేరు కదా. ఎంతో మంది సినీ తారలు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన, లేదా చెడు అలవాట్ల వలన, లేదా ప్రమాదాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలా కొంత మంది టాప్ స్థానంలో ఉన్న నటులు కూడా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.  వాళ్లల్లో ఒకరు ఈ “చరణ్ రెడ్డి”.

ఈ పేరు చెప్పితే బహుశా గుర్తు పట్టక పోవచ్చు..కానీ “ఇష్టం” సినిమాలో హీరో అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో ఆయన నటన అంతా బాగుంటుంది. ఇక ఈ సినిమా ద్వారే ఇండస్టృఈకి పరిచయమైంది శ్రియ సర. ఇప్పుడు ఆమె కెరీర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కవేళ ఈ హీరో కూడా బ్రతికి ఉంటే ఇలానే మంచి పొజిషన్ లో ఉండేవాడు ఏమో..?

అయితే, ఈయన అక్కినేని ఇండి అల్లుడు అని చాలా మందికి తెలియదు. యస్.. ఈ హీరో అక్కినేని ఇంటికి అల్లుడే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ‘ఇష్టం’ సినిమా హీరోగా నటించిన చరణ్ రెడ్డి‌ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. కాని, స్డెన్ గా 2012లో ఉన్నట్లుండి ఈ హీరో గుండెనొప్పితో మరణించారు అని వార్తలు వచ్చాయి. ఇక అప్పుడు బయటపడ్డింది ఈయన అక్కినేని ఇంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అని. అప్పటి వరకు బయట ప్రపంచానికి ఈయన ఆ ఇంటి అల్లుడు అనే సంగతి తెలియదు.

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక ఆ టైంలోనే ఈయన గుండె నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం..మళ్లీ గుండె నొప్పి రావడంతో చనిపోయారు అంటూ వైద్యులు తెలిపారు. ఇక అప్పట్లో ఈ విషయం పై పెద్ద దుమారమే రేగింది. కేవలం 37 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం అందరి మనసులను కలచివేసింది. చరణ్ మరణం అప్పట్లో సంచలనమే. తనకు సినీ అవకాశాలు లేకపోయినా, ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరు వాడకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని తెలిసినవారు చెబుతుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news