సిద్ద్ శ్రీరామ్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సింగర్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఏ ఫంక్షన్ ల కు వెళ్లినఆయన పాడిన పాటలే వినిపిస్తుంటాయి. అంతలా సిద్ శ్రీరామ్ పాటలకు అడిక్ట్ అయ్యిపోయారు ప్రేక్షకులు. అతని గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. అందుకే ఎలాంటి వారినైన ఆయన పాటలు అట్రాక్ట్ చేస్తుంటాయి.
ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే ..ఇతను పాడటం వలన ఆ పాట హిట్ అవుతుందో .. లేక హిట్టయ్యే పాటలనే ఇతను ఎంచుకుని మరీ పడుతున్నాడో.. తెలియదు కానీ ఈయన పాడిన ప్రతి పాట మంచి విజయం అందుకుంటుంది. సినిమా ఫ్లాప్ అయినా సరే ఈయన పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. అందులో సిద్ద్ పాట ఉండాల్సిందే. లేటెస్ట్ టాలీవుడ్ హిట్స్ అన్నీ సిద్ద్ శ్రీరామ్ పాడిన పాటలే కావడం గమనార్హం. గమ్మత్తైన గొంతు, పదాన్ని పలికే తీరులో వైవిధ్యం సిద్ద్ పాటకు ప్రత్యేకతని అలవర్చాయి.
ముఖ్యంగా గీత గోవిందం, అల వైకుంఠపురం చిత్రాలలో సిద్ద్ పాడిన పాటలు ఆయా చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేందుకు ఆమధ్య విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిన్న చిత్రానికి కూడా సిద్ద్ శ్రీరామ్ పాట పాడాడు. ఇక ఆ పాట వల్లే బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది సినిమాకు. నిజానికి చెప్పలంటే సినిమా కన్నా కూడా ఆ పాటే హైలెట్ గా నిలిచింది.
ఇక ఇంత డిమాండ్ ఉన్న పాపులర్ సింగర్ ఒక్క పాటకు ఎంత పుచ్చుకుంటున్నాడు అనే సందేహం చాలామందికి ఉంది. దీంతో సిద్ద్ శ్రీరామ్ పారితోషకం మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా అయితే ఈ రోజుల్లో సింగర్స్‌కు ఒక్క పాట పాడితే 20 వేలు చార్జ్ చేస్తారు.. ఆ సింగర్ కి మంచి ఫాలోయింగ్ ఉంటే 50 వేలు ఇస్తారు.. మరీ గొప్ప సింగర్ అయితే లక్ష అంతే.
అంతకు మించి ఎక్కువ ఇవ్వరు. కానీ సిద్ శ్రీరామ్ కి ఉన్న ఫాలోయింగ్ కి,మార్కెట్ కి ఆయనకు ఒక్క పాటకు సుమారు 4.5లక్షలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి మిగతా సింగర్స్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే కానీ యూత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా ఆయన అడిగినంత ఇస్తున్నారు నిర్మాతలు.