Moviesదృశ్యం2 లో నటించిన ఈమె భర్త మనకు తెలిసినవారే..ఎవరో తెలుసా..?

దృశ్యం2 లో నటించిన ఈమె భర్త మనకు తెలిసినవారే..ఎవరో తెలుసా..?

రీసెంట్ గా రిలీజ్ అయిన వెంకటేష్ నటించిన చిత్రం దృశ్యం2. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా గుర్తింది కదా.. ఆ సినిమాకి వచ్చిన సీక్వెల్ నే ఈ మూవీ దృశ్యం 2. ఈ సినిమాలో వెంకటేశ్ ఇంటిపక్కన ఇల్లాలి పాత్రలో కనిపించిన అమ్మాయే ఈ సరిత.

ఈమె అసలు పేరు సుజా వరుణి ..సినిమాలోకి వచ్చాక సుజాత గా మార్చుకుంది. ఈ సినిమాలో ఈమె భర్త చేతిలో వేధింపులకు గురైన వివాహితగా నటించి.. తన అద్భుతమైన పర్ ఫామెన్స్ తో అలరించింది. ఇక స్సిన్ కట్ చేస్తే సినిమా మలుపు తిరగడానికి కారణం అయిన అండర్ కవర్ పోలీస్ ఆఫిసర్ గా ప్రత్యేక గుర్తింపు లభించింది.

2002లో ప్లస్ 2 అనే తమిళ మూవీతో సుజాత సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది. ఇక ఆ సినిమా తో ఆకట్టుకున్న ఈమె ఆ తరువాత తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించి మచి పేరు సంపాదించుకుంది. సూజాత నటుడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.

ఈమె ఒక పెద్దింటి కోడలు. ఎంతో కష్టపడి పైకి వచ్చింది. సొంతంగా పేరు కూడా సంపాదించుకుంది. తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఈమె జర్నీ మొదలుపెట్టి… ఈరోజు మంచి నటిగా ఈమె ఎదిగింది. సుజా వరుణి దృశ్యం-2 లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

ఈమె ఇది వరకే ఓ సారి వెంకటేష్ సినిమాలో చిన్న పాత్రల్లో మెరిసింది. వెంకీ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమాలో హేమ అనే చిన్న రోల్ చేసి మనల్ని మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కనిపించిన సుజాత గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ సినిమాల్లో కూడా కనిపించింది. ప్రస్తుతం దృశ్యం2తో ఇరగదీసే పాత్రలో నటించి మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమాతో సుజా వరుణికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news