Moviesవిడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్‌కు లైంగీక వేధింపులు...!

విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్‌కు లైంగీక వేధింపులు…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం .. విడిపోవ‌డం అనేది కామ‌న్ అయిపోయింది. అయితే పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకుని.. ఎంతో ఆద‌ర్శంగా దాంప‌త్య జీవితంలో ఉన్న వారు కూడా విడిపోవ‌డం చాలా మందికి షాకింగ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన అమ‌లాపాల్ జీవితం కూడా ఇలాగే అయ్యింది.

అమ‌లాపాల్ స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఏఎల్‌. విజ‌య్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఆమె మూడు సినిమాలు చేసింది. ఆమెతో ప్రేమ‌లో ఉండ‌డం వ‌ల్లే విజ‌య్‌కు ఆమెకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు ఇచ్చార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. పెళ్ల‌య్యాక యేడాదికే వీరి మ‌ధ్య మ‌న‌స్పర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత విజ‌య్ మ‌రో పెళ్లి కూడా చేసుకున్నా.. అమ‌ల మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటోంది.

విడాకుల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అమ‌ల మ‌ళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. విడాకుల త‌ర్వాత కొంద‌రు అమ‌లాపాల్‌ను లైంగీకంగా వేధించ‌డం స్టార్ట్ చేశార‌ట‌. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ఆమెను లైంగీక వేధింపుల‌కు గురి చేయ‌డంతో విసిగిపోయిన ఆమె చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ట‌. చివ‌ర‌కు పోలీసులు రంగంలోకి దిగాక కాని.. ఆమెకు లైంగీక వేధింపులు త‌గ్గ‌లేద‌ట‌.

ఆమెను లైంగీకంగా వేధించిన వారు కూడా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే అట‌. ఈ వేధింపుల‌ను చాలా రోజుల వ‌ర‌కు ఓర్చుకున్న ఆమె చివ‌ర‌కు త‌ట్టుకోలేక పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news