టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి, నందమూరి నట సిం హం బాలయ్యకి మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇద్దరికి ఇద్దరు ఏ విషయంలోను తీసిపోరు. చిరంజీవి, బాలకృష్ణ.. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలే.. అందులోనూ ఇద్దరు మాస్ హీరోలే.. శతాధిక చిత్రాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు వీరిద్దరూ.అయితే వీళ్లిద్దరికి టాప్ హీరో అనే ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది ఒకేఒక్క దర్శకుడని చెప్పాలి. ఆయనే ఎవరో కాదు కోదండరామిరెడ్డి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులున్న అందులో ఏ.కోదండరామిరెడ్డిది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. చలన చిత్ర దర్శకుడిగా ఒక మూసకే పరిమితం కాకుండా.. అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో కోదండరామిరెడ్డి ఒకరు. ‘మనుషులు మారాలి’ తో మొదలైన ఆయన కెరీర్ ఎంతోమంది మనుషుల జీవితాలను నిజంగానే మార్చేసింది.
కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో నటిస్తే చాలు… విజయలక్ష్మి వరించడం ఖాయం అనే నమ్మకం ఎంతోమంది నటీనటులకు కలిగేలా చేశారాయన. పనిని దైవంగా భావించే కోదండరామిరెడ్డి తన విజయ సోపానానికి సాంకేతిక నిపుణులు, నటీనటులు సైతం కారణమంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి అగ్ర హీరోలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి.. ఒక్క అన్న ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రెండు మూడు సార్లు వచ్చినట్టే వచ్చి చేజారింది. కానీ ఓ సినిమాను రెండో యూనిట్ దర్శకుడిగా ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.
టాలీవుడ్‌లో చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిలో 25 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ మటుకు చిత్రాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలో 22 హిట్లున్నాయి. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు న్యాయం కావాలి.. ముఠామేస్త్రీ, అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, త్రినేత్రుడు, మరణ మృదంగం వంటి హిట్ చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి.
ఇక బాలకృష్ణ, కోదండరామిరెడ్డి లది క్రేజీ కాంబినేషన్‌నే అనే చెప్పాలి.. మొత్తం వీరి కాంబినేషన్‌లో మొత్తం 13 చిత్రాలురాగా అన్నీ సినిమాలు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు కావడం విశేషం. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు అనసూయమ్మగారి అల్లుడు, యువరత్న రాణా.. బొబ్బిలి సింహం, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు వంటి చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి. కోదండరామిరెడ్డితో చేసిన సినిమాలు బాలకృష్ణకి మంచి హిట్‌గా నిలిచాయి. అంతేకాదు ఆయన కెరీర్‌కి మరింత ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు