Moviesఅఖండలో విలన్ గా శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడా..?

అఖండలో విలన్ గా శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన చిత్రం “అఖండ”. టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర ఘన విజయం అందుకుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ అందం తో ఆకట్టుకుంటే..కీలక పాత్రలో కనిపించిన పూర్ణ నటనతో మెప్పించింది. జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖండ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదలయ్యింది. ఇక ఈ సినిమా టాక్ వింటుంటేనే అభిమానులు అఖండ సినిమాను ఎంత ఎంజాయ్ చేసారో అర్దమౌతుంది.

థియేటర్లలో అయితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ సీన్ అద్దిరిపోయింది. నిజంగా నందమూరి అభిమానులకు బోయపాటి మాస్ ఫీస్ట్ అందించారనే చెప్పాలి. సినిమా పై ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్యుంటేనే అది తెలుస్తోంది. సినిమా చూసి బయటకి వచ్చిన అభిమానులు ఇది బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు.

ముందు నుండే ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను బోయపాటీ ఎక్కడ తగ్గించకుండా ..రీచ్ కావడంతో టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాస్తుంది అంటున్నారు అభిమానులు. ఓవ‌రాల్‌గా అయితే మాస్ ప్రేక్ష‌కుల‌కు, బాల‌య్య అభిమానుల‌కు మాత్రం విజువ‌ల్ ఫీస్ట్ అని చెప్పక్క తప్పదు.

మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను త‌న‌దైన మార్కును చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర లో నటించాడు. . కాగా శ్రీకాంత్ రోల్ ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానం అధ్బుతంగా ఉందంటున్నారు అభిమానులు. బాలయ్య శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్స్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తే ధియేటర్స్ దద్దరిల్లుతున్నాయట.

ఇక శ్రీకాంత్ ఎప్పటిలాగే సహజమైన నటనతో మెప్పించారు అంటున్నారు. ఈ సినిమాతో మరోసారి విలన్ గా నటించిన శ్రీకాంత్ తన నటనతో బాగా ఆకట్టుకున్నారని టాక్. బాలయ్య తరవాత శ్రీకాంత్ సినీ భారాన్ని తన భుజంపై వేసుకున్నాడనే ఫీలింగ్ అందరికీ వస్తుందని చెబుతున్నారు మూవీ చూసిన కొందరు ఆడియన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news