ఆర్తి అగర్వాల్ 2001లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరపై ఒక్కసారిగా తళుక్కుమంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆమె గిలిగింతలు పెట్టేసింది. అప్పట్లో కేవలం ఆర్తీ కోసమే యూత్ అందరూ నువ్వు నాకు నచ్చావ్ సినిమా పదే పదే చూశారు. ఆర్తి దెబ్బ తోనే నువ్వు నాకు నచ్చావ్ సినిమా 58 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆర్తీకి తెలుగులో అప్పుడు ఉన్న క్రేజీ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.
వెంకటేష్ తో మరోసారి వసంతం – బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు – చిరంజీవితో ఇంద్ర – నాగార్జునతో నేనున్నాను – ఎన్టీఆర్ తో అల్లరి రాముడు – మహేష్‌బాబుతో బాబి – తరుణ్ తో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు – ఉదయ్ కిరణ్ తో నీస్నేహం ఇలా ప్రతి ఒక్క టాప్ హీరో పక్కన ఆమె వరుసపెట్టి సినిమాలు చేసింది. 4-5 సంవత్సరాలు ఆమె క్షణం తీరిక లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.
అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే … ఆమె యంగ్ హీరో తరుణ్ తో ప్రేమలో పడటం వల్లే ఆమె తన కెరీర్ స్పాయిల్ చేసుకుందని ప్రచారం అప్పట్లో వినిపించింది. తరుణ్‌ను ఆర్తి పిచ్చిపిచ్చిగా ప్రేమించిందని… అయితే వీరి పెళ్ళికి తరుణ్ తల్లి రోజారమణి ఒప్పుకోకపోవడంతోనే వారిద్దరూ విడిపోయారు అన్న ప్రచారం కూడా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. ఆ తర్వాత న్యూ జెర్సీ లో ఉండే ఉజ్వల్ నికన్ అనే వ్యక్తిని ఆర్తి అగర్వాల్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది.
4 ఏళ్లకే అతడితో కాపురం పెటాకులు కావడంతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. అప్పటికే ఆమె బాగా బరువు పెరిగి… లావుగా మారిపోయింది. అయితే బరువు తగ్గేందుకు ఆమె చేయించుకున్న ఆపరేషన్ వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమెకు సిగరెట్లు తాగే అలవాటు ఎక్కువగా ఉంది.
రోజుకు డజన్ల కొద్ది సిగరెట్లు ఉఫ్‌మని ఊదేసేదట. ఈ క్రమంలోనే ఆమెకు ఊబకాయం రావడంతో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా వచ్చాయి. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు ఆమె చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆర్తిఅగర్వాల్ చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.