దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య రు. 400 కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే యేడాది నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఏకంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ట్రైలర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమా రిలీజ్‌కు కూడా మరి కొద్ది రోజుల టైం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని అందరూ ఎదురు చూస్తోన్న వేళ ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది సినీ ప్రేమికుల గుండెలు పగిలిపోయే న్యూసే అని చెప్పాలి.
ఆర్ ఆర్ వాయిదాకు ఒక్కటి కాదు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తితో దేశంలో మరోసారి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయని అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ప్యూ అమల్లో ఉంది. దక్షిణాదిలో కూడా కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ప్యూ అంటున్నారు.
ఇక మళ్లీ థియేటర్లలో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలు కానుందని తెలుస్తోంది. సంక్రాంతికి మళ్లీ కరోనా కేసులు బాగా స్ప్రెడ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయనుకుంటే.. ఇప్పుడు అక్కడ ప్రభుత్వ తనిఖీలతో చాలా థియేటర్లు సీజ్ అవుతున్నాయి. మరి కొన్ని థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఒక జిల్లాలో 50 సెంటర్లు ఉంటే పట్టుమని పది సెంటర్లలోనే సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది.
ఇదే జరిగితే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కు రాదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను
సమ్మర్‌కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆర్ ఆర్ లవర్స్‌కు మరోసారి పెద్ద నిరాశే అని చెప్పాలి.