యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ నెల 2వ తేదీన రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అఖండ జ్యోతిలా గర్జిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా కావడంతో పాటు బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అఖండపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకుంటూ అఖండ దూసుకు పోతోంది. ఇప్పటికే రు. 50 కోట్ల షేర్‌కు చేరువ అయిన అఖండ వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ ఈ ప్రి రిలీజ్ వేడుకతోనే బోయపాటి గారు ఈ ఆడిటోరియం మొత్తానికే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఊపు తీసుకు వచ్చారని.. ఆయనకు ధన్యవాదాలు అని.. డిసెంబర్ 2 నుంచి మొదలు పెట్టి థియేటర్లు కూడా కంటిన్యూస్‌గా హౌస్ ఫుల్ అయ్యేలా తెలుగు ప్రేక్షకులు అఖండ మంచి ఉత్సాహం, ఆనందం కలిగించాలని తాను కోరుకుంటున్నాను అని ఆయ అన్నారు.
ఇప్పుడు అఖండ రిలీజ్ అయ్యింది. రాజమౌళి కోరుకున్నట్టే అఖండ సూపర్ హిట్ అయ్యింది. మిక్స్ డ్ టాక్ తో కూడా వసూళ్లలో మాత్రం దూసుకు పోతోంది. అసలు ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్‌చేయాలా ? వద్దా ? రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూస్తారా ? చూడరా ? అన్న డౌట్లు పటాపంచలు చేస్తూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అసలు ఇండస్ట్రీ వర్గాలకే అఖండ పెద్ద భరోసా కల్పించింది.
ఇక పుష్ప, ఆర్ ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలు ధైర్యంగా రిలీజ్ చేయవచ్చన్న భరోసా ఆయా సినిమాల నిర్మాతలకు కలుగుతోంది. ఏదేమైనా రాజమౌళి ఎలా అయితే కోరుకున్నారో ఆ కోరికను బాలయ్య అఖండ సినిమాతో తీర్చేశారు. ఇప్పుడు తన ఆర్ ఆర్ సినిమా విషయంలో కూడా అఖండ పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.