తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని ఫ్యామిలీది సుదీర్ఘమైన ప్రస్థానం. దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన పునాది.. ఈ ఫ్యామిలీని ఈరోజుకి తెలుగు ప్రజల హృదయాల్లో అలా నిలబెట్టి వేసింది. ఏఎన్ఆర్ తర్వాత ఆయన తనయుడు నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నారు. తండ్రి ఇచ్చిన ఘనమైన వారసత్వాన్ని నాగార్జున నిలబెట్టుకున్నారు. తండ్రి బాటలోనే నటించడంతో పాటు… ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. తండ్రి నాగేశ్వరరావులా నాగార్జునకు కూడా ఎంతోమంది యువరక్తాన్ని ప్రోత్సహించిన ఘనత దక్కుతుంది.
రాంగోపాల్ వర్మ – దశరథ్ – రాఘవ లారెన్స్ ఇలాంటి దర్శకులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునకు దక్కుతుంది. ఇక నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే దివంగత సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. 1986వ సంవత్సరంలో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో నాగార్జున వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే అందుకు రెండు సంవత్సరాల ముందే 1984లో శ్రీ లక్ష్మి తో నాగార్జున పెళ్లి జరిగింది.
1986లో ఈ దంపతులకు ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్య జన్మించాడు. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నన్నాయి. పెళ్ళికి ముందు అమెరికాలో ఇంజనీరింగ్ చదివిన నాగార్జున ఆ తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు. నాగార్జునను ముందుగా సినిమాల్లోకి తీసుకురావాలని ఏఎన్నార్ కూడా అనుకోలేదు. అయితే నాగార్జునకు నటన మీద ఇష్టం ఉండడంతో స్వతహాగా సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యారు. ఇక శ్రీ లక్ష్మితో చిన్న వయసులోనే నాగార్జునకు పెళ్లి అయ్యింది.
పెళ్లి తర్వాత శ్రీలక్ష్మికి నాగార్జునకు మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు సంవత్సరాలకు 1990లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనతో పాటు శివ- నిర్ణయం సినిమాలలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. ఇక ఒక అభిమాని నాగార్జున మొదటి పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నన్నాయి. ఇంత వయసు వచ్చినా కూడా నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు.