Movies' అఖండ ' రెండో రోజు క‌లెక్ష‌న్స్‌.. అప్పుడే అక్క‌డ లాభాలు...!

‘ అఖండ ‘ రెండో రోజు క‌లెక్ష‌న్స్‌.. అప్పుడే అక్క‌డ లాభాలు…!

నందమూరి నటసింహం బాలకృష్ణ – మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల‌లో నటించారు. థ‌మన్ సంగీతం అందించారు. కరోనా ప్రభావంతో ఏడాదిన్నర పాటు థియేటర్లలో రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన అఖండ‌ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో అఖండ అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది.

అఖండ సినిమాకు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ రావడంతో పాటు బాలయ్య అఖండ గర్జనతో థియేటర్లు దద్దరిల్లి పోయాయి. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రు. 18 కోట్ల షేర్ రాబట్టిన అఖండకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 14 కోట్ల షేర్ ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెప్పాయి. ఇక రెండో రోజు కూడా అఖండ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. రెండో రోజు అఖండ ఏపీ, తెలంగాణలో రు 6. 6.5 కోట్ల రేంజ్‌లో షేర్ రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ అఖండ సినిమా రు. 2.5 కోట్లకు అమ్మారు. అక్కడే ఫస్ట్ డే అఖండ‌ 2.25 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా అక్కడ 1.1 కోట్ల షేర్ రావడంతో ఇప్పటికే లాభాల బాటలో కి వచ్చేసింది. ఓవ‌ర్సీస్లో ఇప్ప‌టికే అఖండ‌కు హాఫ్ మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు వ‌చ్చాయి. లాంగ్ ర‌న్ లో ఇది 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేస్తుంద‌ని అంటున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రు. 49 కోట్ల థియేట్రిక‌ల్ షేర్ రావాల్సి ఉంది. ఇప్ప‌టికే రు. 20 కోట్ల షేర్ దాటింది. పుష్ప వ‌చ్చే వ‌ర‌కు అఖండ‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎదురు లేదు. మ‌రి బాల‌య్య ఏం చేస్తారో ? చూడాలి. అఖండ ఏరియా వైజ్ రెండో రోజు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.26 కోట్లు

సీడెడ్ – 1.98 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 96 ల‌క్ష‌లు

ఈస్ట్ – 46 ల‌క్ష‌లు

వెస్ట్ – 34 ల‌క్ష‌లు

గుంటూరు – 41 ల‌క్ష‌లు

కృష్ణా – 44 ల‌క్ష‌లు

నెల్లూరు – 25 ల‌క్ష‌లు
——————————————
ఏపీ + తెలంగాణ = 6.83 కోట్ల షేర్‌
గ్రాస్ = రు. 10.40 కోట్లు
——————————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news