నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. బాక్సాఫీస్ దగ్గర మూడోవారంలో కి ఎంట్రీ ఇచ్చినా కూడా అఖండ జోరు తగ్గలేదు. మొదటి రోజునుంచే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న అఖండ మూడో వీకెండ్ లో కూడా అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టడం విశేషం అని చెప్పాలి. పదిహేనో రోజు బాక్సాఫీస్ దగ్గర 32 లక్షల షేర్ రాబట్టిన అఖండ 16వ రోజు 29 లక్షల షేర్ కొల్లగొట్టింది. ఇక 17వ రోజు ఏకంగా రు. 46 లక్షల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఇక 18వ రోజు ఆదివారం కావడంతో ఓవరాల్‌గా 78 లక్షల షేర్ తో దుమ్ముదులిపేసింది. ఓవైపు పుష్ప థియేటర్లలో పాగా వేసింది. ఆ సినిమాకు కేవలం రెండు రోజులకే వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలాంటి టైంలో కూడా పుష్ప 18వ రోజు 78 లక్షల షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. రు. 54 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన అఖండకు ఇప్పటికే రు. 20 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.
అఖండ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 18.92 కోట్లు
సీడెడ్ – 14.38 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.85 కోట్లు
ఈస్ట్ – 3.93 కోట్లు
వెస్ట్ – 3.29 కోట్లు
గుంటూరు – 4.51 కోట్లు
కృష్ణా – 3.42 కోట్లు
నెల్లూరు – 2.48 కోట్లు
————————————————-
ఏపీ + తెలంగాణ = 56.78 కోట్లు (షేర్)
గ్రాస్ = 93.20 కోట్లు
————————————————-
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా – 4.70 కోట్లు
ఓవర్సీస్ – 5.34 కోట్లు
ఇక 18 రోజులకు వరల్డ్ వైడ్‌గా రు. 76.82 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రు. 115 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమా ప్రారంభమవుతుంది.