బాలయ్య – బోయపాటి శ్రీనుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో గతంలో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా కావడంతో ముందు నుంచే అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్లు, ట్రైలర్లు అదర గొట్టేశాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్నా . ఓ వైపు ఆంధ్రాలో టిక్కెట్ రేట్లు తగ్గించినా కూడా అఖండకు రు. 54 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. యేడాదిన్నర పాటు బాలయ్య అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఈ రోజు అలా థియేటర్లలోకి దిగిందో లేదో సూపర్ హిట్‌టాక్ సొంతం చేసుకుంది.
బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అఖండ లెజెండ్‌ను మించి ఉందని అంటున్నారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు అంతా యాక్షన్ మయం అన్నట్టుగా కొనసాగింది. మైనింగ్ అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రజలు ఎలా చనిపోతున్నారు ? దీని వెనక ఉన్న ఆ స్వామిజీ ఎవరు ? దీనికి బాలయ్య ఎలా చెక్ పెట్టాడు ? కలెక్టర్ ప్రగ్య జైశ్వాల్‌కు దీనికి ఉన్న లింక్ ఏంటి ? అసలు అఘోరా క్యారెక్టర్‌కు దీనికి ఉన్న లింక్ ఏంటన్న ప్రశ్నలకు ఆన్సరే ఈ సినిమా.
ఫస్టాఫ్ అయితే సినిమా చాలా స్పీడ్‌గా చకచకా ముందుకు వెళ్లిపోయింది. మాస్ జనాలకు కావాల్సినన్ని ఫైట్లు అఖండలో ఉన్నాయి. ఓవరాల్‌గా అఖండ మాస్ జాతరే జాతర. ఇద్దరు బాలయ్యలు కూడా ఫైట్లలో ఇరగదీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా లెజెండ్, సింహాలను మించిన రేంజ్లో బోయపాటి డిజైన్ చేసుకున్నాడు. అయితే క్లైమాక్స్‌కు ముందు ఎలాంటి ట్విస్టులు లేవు. అయినా బాలయ్య ఒక్కడే యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాను ఒంటి చేత్తో ముగించేశాడు.