Moviesఅఖండ‌... బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. మాస్ జాత‌ర‌

అఖండ‌… బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. మాస్ జాత‌ర‌

నంద‌మూరి న‌ట‌సింహం యువ‌ర‌త్న బాల‌కృష్ణ న‌టించిన అఖండ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాల‌య్య ఇటీవ‌ల కాలంలో ఫుల్ ఎన‌ర్జీతో ఊగిపోతున్నారు. ఆయ‌న చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. దీనికి తోడు ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ టాక్ చేస్తుంటే ఆ ఎపిసోడ్లు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు అవుతున్నాయి. ఇక ఇన్ని పాజిటివ్ అంశాల మ‌ధ్య ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అఖండ బొమ్మ మాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో ముందు బెనిఫిట్ షోలు ప‌డ్డాయి. ఎక్క‌డికక్క‌డ ఫ్యాన్స్ పూన‌కాల‌తో ఊగిపోతూ ఉంటారు. బోయ‌పాటి ఫ్యాన్స్‌కూ మాస్ ఫీస్ట్ అందించిన‌ట్టుగా చెపుతున్నారు. ఇక బాల‌య్య ఫ్యాన్స్ సంబ‌రాల‌కు అంతే లేకుండా పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ గ‌త అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల ముందు బాణ సంచా కాలుస్తూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. బొమ్మ సూప‌ర్ డూప‌ర్ హిట్ అని సోష‌ల్ మీడియాలో టాక్‌ను స్ప్రెడ్ చేస్తున్నారు.

మ‌రోవైపు సినిమాలో యాక్ష‌న్ సీన్లు, డైలాగులు అప్పుడే సోష‌ల్ మీడియాలో లీక్ అయిపోయాయి. ఎవ‌రికి వారు సినిమా చూస్తున్న‌ప్పుడు థియేట‌ర్ల‌లో వీడియోలు తీసేసి బ‌య‌ట‌కు వ‌దిలేస్తున్నారు. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ గ్రూపుల నుంచే అన్ని వాట్సాప్‌, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఏదేమైనా అఖండ వ‌సూళ్ల ప‌రంగా బాల‌య్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news