రజనీ 1985- 1990వ దశకంలో ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్. అటు అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. అప్పట్లో ఆమె దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేది. ఆమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మళయాళ సినిమాలు కూడా చేసేది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె తల్లిదండ్రులు చూసిన ఓ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అప్పటికే ఆమె 200కు పైగా సినిమాల్లో నటించింది.
రజనీ సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానం. ఆమె ఇంటి పక్కన ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ చూసేందుకు వచ్చిన ఆమె అనుకోకుండా ఆ సినిమా దర్శకుడి కంట్లో పడింది. రజనీని చూసిన ఆ దర్శకుడు ఆమె వివరాలు కనుక్కోమని తన సిబ్బందికి చెప్పాడట. వెంటనే తన నెక్ట్స్ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు.. అలా అనుకోకుండా ఆమె హీరోయిన్ అయిపోయింది.
1985లో ఆమె బ్రహ్మముడి అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో రాజేంద్రప్రసాద్ – రజనీది క్రేజీ కాంబినేషన్. ఇక్కడ బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టింది. ఇక ముగ్గురు పిల్లలు పుట్టాక భర్తతో ఆమెకు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.. ఇప్పుడు ఆమె బెంగళూరులో ఉంటోంది.