టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఓ టాప్ ప్రొడ్యుసర్.. తిరుగులేని డిస్ట్రిబ్యూటర్.. మంచి కథలను జడ్జ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన సక్సెస్ రేటు మిగిలిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పోలిస్తే చాలా ఎక్కువుగా ఉంటుంది. ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమాను జడ్జ్ చేయడంలో రాజుకు రాజే సాటి. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
ఈ పెద్ద సినిమాల నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ దాదాపు ఆయన చేతుల్లోకే వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నైజాం రైట్స్ ఆయన చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ సినిమా కోసం ఆయన రు. 70 కోట్ల ఆఫర్ చేశారు. ఈ మేరకు డీల్ కూడా అయ్యిందని టాక్ ? ఇక పవన్ కళ్యాణ్ – రానా కాంబోలో వస్తోన్న భీమ్లా నాయక్‌కు కూడా రు. 40 కోట్ల మేర చర్చలు నడుస్తున్నాయి. బాలయ్య అఖండ సినిమా రైట్స్ కూడా ఇప్పటికే రాజు చేతుల్లో ఉన్నాయి. ఇక రాధే శ్యామ్ కూడా నైజాం రైట్స్ వరకు ఎప్పుడో రాజు చేతుల్లోకి వచ్చేశాయి.
ఇక ఇప్పుడు పుష్ప సినిమా రైట్స్ కూడా రాజు చేతుల్లోకి వెళ్లబోతున్నాయా ? అంటే ట్రేడ్ వర్గాల్లో అవును అన్న టాక్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం మైత్రీ వాళ్లకు రాజుకు మధ్య ఏదో గ్యాప్ వచ్చిందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి. ఈ క్రమంలోనే పుష్ప నైజాం రైట్స్ ఖచ్చితంగా వరంగల్ శ్రీనుకే వెళతాయని అనుకున్నారు. అయితే ఇప్పుడు అటూ ఇటూ తిరిగి పుష్ప మళ్లీ రాజు చేతుల్లోకే వెళ్లబోతోందని.. రు. 45 కోట్ల మధ్యలో డిస్కర్షన్లు నడుస్తున్నాయని అంటున్నారు.
అల వైకుంఠపురం క్లోజింగ్ రేటు 45 కోట్లు. ఇప్పుడు పుష్పకు కూడా అదే రేటు అడుగుతున్నారు. మరి రాజు అంత ఇస్తారా ? ఫైనల్‌గా ఈ భేరసారాలు ఎక్కడ తెగుతాయి ? ఈ రైట్స్ రాజు చేతికే చిక్కుతాయా ? అన్నది చూడాలి.