ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కాస్టింగ్‌కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఇది ఇప్పటికిప్పుడే పుట్టకు వచ్చింది కాదు.. దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నదే. చాలా మంది కెరీర్ స్టార్టింగ్‌లో వేరే దిక్కులేక ఈ కమిట్‌మెంట్లకు ఒప్పుకుంటున్నారు. పక్క సుఖం పంచి మరీ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోన్న చాలా మంది హీరోయిన్లు ఇలా పక్క సుఖాలు పంచి వచ్చిన వారే.
ఇక సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి తెలిసిందే. కోలీవుడ్‌లో ఆమెను అప్పటి ప్రేక్షకులు దేవతగా భావించే వారు. ఆమెకు ఏకంగా గుడి కట్టి మరీ పాలాభిషేకాలు చేశారు. ఇక ఆమె తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోల పక్కన చేసింది కూడా..! ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం ఆమె తనను ఓ తెలుగు స్టార్ హీరో కమిట్‌మెంట్ అడిగాడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటకీ సంచలనంగానే ఉన్నాయి.
ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో ఆమె నటిస్తుండగా.. ఓ స్టార్ హీరో ఆమెను పడక గదిలోకి రమ్మని కమిట్‌మెంట్ అడిగాడట. దీంతో వెంటనే ఖుష్బూ ఏ మాత్రం డౌట్ లేకుండా నీ కూతురును తన తమ్ముడు గదిలోకి పంపిస్తే.. తాను ఆ హీరో పడక గదికి వచ్చేందుకు రెడీ అని చెప్పిందట. మరోసారి ఇలా చేస్తే చెప్పుతో కొడతానని కూడా ఆమె వార్నింగ్ ఇచ్చిందట.
ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆ హీరోకు, ఖుష్బూకు మాటలు లేవని తెలుస్తోంది. అయితే ఖుష్బూనే పడక గదిలోకి రమ్మన్న ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు ? అన్నది మాత్రం బయట కూడా వైరల్ కావడం లేదు. ఆమె నటించిన సినిమాలు.. అందులో నటించిన హీరోలా ? లేదా బయట హీరోలా ? అన్నది మాత్రం ఖుష్బూకే తెలియాలి.