సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన 1977లో రిలీజ్ అయిన దాన వీర శూర కర్ణ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అప్పట్లోనే పది లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా కోటి రూపాయల షేర్ రాబట్టింది. సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్ర సినిమాకు పోటీగా రిలీజ్ అయిన కర్ణ తెలుగునాట ఇప్పటికీ ఓ సంచలన సినిమాగా నిలిచిపోయింది.
ఒకే రోజు రిలీజ్ అయిన కురుక్షేత్ర – కర్ణ సినిమాలు మహాభారత కథాంశంతో తెరకెక్కినవే. అయితే కర్ణ సూపర్ హిట్ అయితే కురుక్షేత్ర ప్లాప్ అయింది. 1994లో దాన వీర శూర కర్ణ సినిమా రెండోసారి రిలీజ్ అయింది. విచిత్రమేంటంటే రెండో సారి రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇక దాన వీర శూర కర్ణ తెలుగు సినిమా చరిత్రలోనే ఎక్కువ నిడివితో రిలీజ్ అయిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
4.17 గంటల నిడివితో ఇప్పటకీ పొడవైన సినిమాగా కర్ణ రికార్డుల్లో నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరు తనయులు హరికృష్ణ అర్జునుడుగా బాలకృష్ణ అభిమన్యుడుగా నటించారు.ఎన్టీఆర్ నటించిన 248 వ సినిమా కర్ణ నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడు – కర్ణుడు – దుర్యోధనుడు పాత్రలో నటించారు.
అయితే ఏఎన్నార్‌ను కృష్ణుడు లేదా కర్ణుడు పాత్రలో నటించాలని ఎన్టీఆర్ కోరారట. కృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ ను చూసి కళ్ళు తనను చూడవని ఏఎన్నార్ చెప్పారట. కర్ణుడు నటించాలని కోరితే తాను కర్ణుడిగా కనిపిస్తే పాండవులు కూడా మరుగుజ్జులుగా కనిపిస్తారని… అందువల్ల ఆ పాత్రలో కూడా నటించలేనని చెప్పారట.
అప్పటి సీఎం జలగం వెంగళరావు, ఎన్టీఆర్ కోరిక మేరకు ఏఎన్నార్ ను ఈ సినిమాలు నటింపజేసే ప్రయత్నం జరిగినా… ఏఎన్ఆర్ మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.