సినిమా రంగంలోకి చాలా అనామకురాల్లుగా వచ్చిన హీరోయిన్లు.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. అయితే వీరిలో చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఒక పేరుతో ఉంటే.. ఇండస్ట్రీలోకి వచ్చాక మరో పేరుతో స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. కొందరు హీరోయిన్ల పేర్లు దర్శకులో లేదా నిర్మాతలు మార్చేసేవారు. మరి కొందరు హీరోయిన్లు తమ పేర్లు తామే మార్చుకుంటే.. మరి కొందరు జాతకాల నేపథ్యంలో పాత పేర్లు కలిసి రావని కొత్త పేర్లు పెట్టుకున్నారు. ఇలా పేర్లు మార్చుకుని స్టార్ హీరోయిన్లు అయిన వారు ఎవరో ఒకసారి చూద్దాం.
1- జయసుధ:
సహజ నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అసలు పేరు సుజాత. అప్పటికే సుజాత పేరుతో మరో హీరోయిన్ ఉన్నారు. దీంతో ఆమెకు దర్శకరత్న దాసరి నారాయణ రావు జయసుధ అని పేరు పెట్టారు. చివరకు అదే స్థిరపడిపోయింది.
2-జయప్రద:
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆమె పేరు లలితా రాణి. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె పేరు జయప్రద అయ్యింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా రెండుసార్లు ఎంపీ కూడా అయ్యారు.
3- శ్రీదేవి:
భారతదేశం గర్వించదగ్గ హీరోయిన్లలో ఒకటి అయిన శ్రీదేవి.. సినిమాల్లోకి రాకముందు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత ఆమె పేరు శ్రీదేవి గా మారిపోయాక ఆమె ఎంతలా వెలిగిపోయిందో మనం చూశాం.
4- సౌందర్య:
కన్నడ నటి అయిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిలా ఇక్కడ సెటిల్ అయిపోయింది. టాలీవుడ్‌ను ఆమె ఓ ఊపు ఊపేసింది. ఆమె అసలు పేరు సౌమ్య.
5- రోజా:
ఏపీ రాజకీయాల్లో తిరుగులేని ఫైర్ బ్రాండ్‌గా కొనసాగుతోన్న రోజా అసలు పేరు శ్రీ లతా రెడ్డి. అయితే అది బాగోలేదని దివంగత నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ ఆమె పేరు రోజాగా మార్చేశారు. దీంతో ఆమె పాపులర్ అయిపోయింది.
6- రంభ:
విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఆ పేరు బాగోలేదని రంభగా మార్చారు. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ సినిమాను ఏలేసింది.
7- నయనతార:
లేడీ సూపర్ స్టార్ నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. మళయాళ ఇండస్ట్రీకి చెందిన ఆమె పేరును సినిమాల్లోకి వచ్చాక మార్చారు.
8- అనుష్క:
కర్నాటకలోని మంగళూరుకు చెందిన అనుష్క అసలు పేరు స్విటీ శెట్టి. అయితే సూపర్ సినిమాతో ఆమెను వెండితెరకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఆమె పేరును అనుష్క అని మార్చారు. దీంతో ఆ పేరుతో ఆమె వెలిగిపోయింది.