Moviesహీరోయిన్లకు పేరు వస్తుందంటే..స్టార్ హీరోలు అలా చేయరు ..సంచలన విషయాలను బయటపెట్టిన...

హీరోయిన్లకు పేరు వస్తుందంటే..స్టార్ హీరోలు అలా చేయరు ..సంచలన విషయాలను బయటపెట్టిన తాప్సీ..!!

తాప్సీ.. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాప్సీ.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి. దిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ… ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రిత‌మే తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు బాలీవుడ్ లో తనదైన స్టైల్లో దూసుకుపోతుంది.

తెలుగులో కొన్ని సినిమాలు చేసినా… వెంక‌టేష్ లాంటి పెద్ద హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు వ‌చ్చినా కూడా.. ఆమెకు ఎందుకో గాని స్టార్ డ‌మ్ రాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్క‌డ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వ‌స్తోంది. పైగా కంగ‌నా లాంటి వాళ్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నా… వివాదాల‌కు దూరంగా ఉండ‌డం తాప్సీకి ఎప్పుడూ ప్ల‌స్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తాప్సీ ఓ స్టార్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది స్టార్ హీరోలు ఇష్టపడరని తెలిపింది. ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని.. ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక నటుడిని నిర్మాతలు సంప్రదిస్తే..అందుకు ఆ స్టార్ హీరో నో చెప్పారని చెప్పుకొచ్చింది. నిజానికి ఆయన తనతో ముందే ఓ సినిమాలో నటించారని కానీ తనతో నటించడానికి ఆయన ఎందుకు ఒప్పుకోలేదో తెలియడం లేదని బాధపడ్డింది. ఇన్ని చెప్పిన తాప్సీ ఆ స్టార్ హీరో పేరు మాత్రం చెప్పనేలేదు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news