సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరు. ఐదు దశాబ్దాలకు పైగా కృష్ణ తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారనే చెప్పాలి. తన తోటి నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు పోటీగా అప్పట్లోనే కృష్ణ పోటీపడి మరీ సినిమాలు చేసేవారు. అప్పట్లో కృష్ణ ఏది చేసినా కూడా ఓ ట్రెండ్ సెట్ అయ్యేది. సింహాసనం సినిమా కావచ్చు.. కౌబాయ్ సినిమాలు కావచ్చు.. దొంగలు, మోసగాళ్ల లాంటి కథలతో తెలుగు ప్రేక్షకులను కొత్తగా మెప్పించడానికే ఇష్టపడేవారు.
కృష్ణ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేసేవారు. ఈ క్రమంలోనే తనతో కలిసి నటించిన కో స్టార్ విజయనిర్మలను రెండో భార్యగా స్వీకరించారు. అప్పటికే విజయనిర్మలకు మరో వ్యక్తితో పెళ్లయ్యి నరేష్ కొడుకుగా ఉన్నారు. కృష్ణ – విజయనిర్మల, కృష్ణ – జయసుధ, కృష్ణ – జయప్రద, కృష్ణ – శ్రీదేవి ఇలా ఈ కాంబినేషన్లు అన్ని అప్పట్లో సూపర్ హిట్. కృష్ణ పై నలుగురు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు ఈ జంటలు హిట్ ఫెయిర్లుగా గుర్తింపు పొందాయి.
అయితే కృష్ణ – జయప్రదది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో ఏకంగా 42 సినిమాలు వచ్చాయి. వీరిద్దరు ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడంతో బయట రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఈ కారణంతోనే జయప్రదకు విజయ నిర్మలకు పడేది కాదట. నటనా పరంగా మాత్రం జయప్రద, విజయ నిర్మల ఇద్దరూ కూడా పోటీ పడి నటించే వారు.
అయితే కృష్ణతో జయప్రద మరీ సన్నిహితంగా ఉండడం.. వారి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావడం.. ప్రేక్షకులకు కూడా ఆ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉండడంతో విజయనిర్మల, జయప్రద మధ్య ఓ తెలియని గ్యాప్ వచ్చిందనే అంటారు. అయితే కృష్ణ – విజయనిర్మల మాత్రం ఎప్పుడూ అన్యోన్యంగానే ఉండేవారు. నరేష్‌ను కూడా కృష్ణ తన సొంత కొడుకులా చూసుకునే వారు.